అన్ని వర్గాల వారికి ఇష్టమైన జోనర్ థ్రిల్లర్ జోనర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ ఈమధ్య క్రైమ్ థ్రిల్లర్స్ కు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఈమధ్య కాలంలో ఆ జోనర్ లలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇదే జోనర్ లో మరో సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా డిసెంబర్1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక హీరోయిన్ మర్డర్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. ఆమెతో పాటు సిటీలో మరో మూడు మర్డర్ లు జరుగుతాయి. ఈ హత్యలను ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
కాగా ఈ మూవీలో సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటిస్తున్నారు.నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: