సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్ధంతి.. మహేష్ బాబు, నమ్రత ఘన నివాళులు

Mahesh Babu and Namrata Shirodkar Pay Grand Homage To Superstar Krishna Garu

దివంగత నటుడు, టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ తొలి వర్ధంతి నేడు (నవంబర్ 15, 2023). ఈ సందర్భంగా కృష్ణ తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు మరియు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ దంపతులు ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత మహేష్, నమ్రతలు కృష్ణ, ఇందిరా దేవి దంపతుల ఫోటోల వద్ద పువ్వులు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం వారి పిల్లలు గౌతమ్ మరియు సితార ఇరువురూ తమ తాతకు నమస్కరించి అంజలి ఘటించారు. కాగా ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన తండ్రిని గుర్తు చేసుకుని ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “సూపర్ స్టార్ ఆల్వేస్ అండ్ ఫరెవర్” అని అందులో పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సూపర్‌ స్టార్‌ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఫిల్మ్ నగర్ క్లబ్‌కు విచ్చేసి కృష్ణ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. వీరిలో మాజీ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడు మరియు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తదితరులు ఉన్నారు. కాగా ఇటీవలే విజయవాడలో ప్రముఖ తమిళ్ హీరో కమల్ హాసన్ చేతులమీదుగా కృష్ణ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక కృష్ణ వర్ధంతి సందర్భంగా.. ‘మహేష్ బాబు ఫౌండేషన్’ తరపున ఒక 40 మంది పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించనున్నామని, తద్వారా వారి ఫుల్ ఎడ్యుకేషన్ బాధ్యత తాము తీసుకుంటున్నామని ఆయన కోడలు నమ్రత ఈ మధ్యే తెలియజేశారు.

అంతేకాకుండా తాము నిర్వహిస్తున్న ఈ మంచి కార్యక్రమానికి స్ఫూర్తి తమ మామయ్యగారేనని, ఆయన ఆశీస్సులు తమకు ఎల్లవేళలా ఉంటాయని భావిస్తున్నామని కూడా ఆమె పేర్కొన్నారు. కాగా సూపర్‌స్టార్ కృష్ణ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా రాణించారు. కాగా కృష్ణ పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. ఇక గతేడాది నవంబర్ 15న ఆయన కన్నుమూసిన విషయం గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఆయన నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో కొనసాగున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో నటించారు.

ఇదిలా ఉండగా.. మహేష్ సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడం, అలాగే మహేష్ బాబు ఈ చిత్రంలో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో ‘గుంటూరు కారం’పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘గుంటూరు కారం’ ఫస్ట్‌ సింగిల్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 19.2 మిలియన్ల వ్యూస్ పైగా సాధించి రికార్డ్ సృష్టించింది.

ఒక్క రోజులో అత్యధిక వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలిచింది. ‘ధమ్‌ మసాలా’ అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సంజిత్‌ హెగ్డే, జ్యోతి నూరన్‌ ఆలపించారు. ఇక ‘గుంటూరు కారం’ చిత్రాన్ని హారికా & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా.. నాగవంశీ, హారిక సూర్యదేవర సమర్పిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే యేడాది జనవరి 12న పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.