శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. రాంగ్ యూసేజ్ అంటూ వచ్చే ఈపాటను నవంబర్ 21వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈపాటకు చంద్రబోస్ లిరిక్స్ అందిస్తుండగా..అజీజ్ నకాష్ ఈపాటను ఆలపించాడు.
The energetic voice of @AzizNakash and the super catchy Lyrics of @boselyricist will bring you the vibe of #WrongUsage to your playlists 🎶#SAINDHAV First Single on NOV 21st ❤️🔥
Music by @Music_Santhosh 🥁#SaindhavOnJAN13th 💥
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl… pic.twitter.com/UlZnrJ0RVl
— Niharika Entertainment (@NiharikaEnt) November 17, 2023
కాగా ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: