టాలీవుడ్ హీరో సుమంత్ కొత్త సినిమాకు టైటిల్ ఖరారు అయింది. మీనాక్షి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘మహేంద్రగిరి వారాహి’ అనే పేరును ఫిక్స్ చేశారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు రాజశ్యామలా అమ్మవారి నిత్య ఉపాసకులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సమక్షంలో సినిమా టైటిల్‌ని మేకర్స్ ప్రకటించారు. అంతకుముందు చిత్రబృందం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించి రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామి వార్ల ఆశీస్సులు పొందారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ చిత్ర కథ మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు సంతోశ్ చెప్పారు. ఈ నేపథ్యంలో రాజశ్యామల అమ్మవారు కొలువుదీరిన ఆలయం విశాఖ శారదా పీఠంలోనే ఉన్నందున అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడకు వచ్చామని నిర్మాతలు తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే టాకీ పూర్తి చేసుకోనుందని, త్వరలోనే నిర్మాణం పూర్తవుతుందని వారు చెప్పారు. ఈ సందర్భంగా హీరో సుమంత్ స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకోగా.. స్వామివారు ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ నేపథ్యంలో సుమంత్ సోషల్ మీడియా ద్వారా ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రివీల్ చేయగా.. ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సుమంత్ ఇటీవలే ‘సీతారామం’ మరియు ‘సార్’ సినిమాలలో కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
Presenting the title and first look of our film#MahendragiriVarahi 🙏🏼@iSumanth@Minakshigoswamy @vennelakishore@kalipumadhu5 #MSubbaReddy @anuprubens@Santhosshjagar1 @inagavijaykumar
Shoot in progress🎬
Coming soon to theatres… pic.twitter.com/ZHP8ysehLL— Sumanth (@iSumanth) November 17, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్‌డ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: