కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 259

Megastar Chiranjeevi Dances To Jawan Song in Diwali Party, Video Goes Viral
సాంగ్

షారుఖ్ పాటకి మెగాస్టార్ స్టెప్పులు, వీడియో వైరల్

మెగా పవర్ స్టార్ రామ్‍ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు దీపావళి పండుగ సందర్భంగా గత శనివారం రాత్రి తమ నివాసంలో గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమ ముద్దులపట్టి క్లీంకార పుట్టిన తర్వాత వచ్చిన మొదటి దీపావళి కావడంతో వారు ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో విక్టరీ వెంకటేశ్, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేశ్‌బాబు-నమ్రత, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌-ప్రణతి దంపతులు ఉన్నారు. అలాగే వీరితోపాటు మరికొందరు దర్శక, నిర్మాతలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అవి విపరీతంగా వైరల్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
rajinikanth praises on jigarthanda doublex movie team
సినిమా వార్తలు

జిగర్ తండ డబుల్ ఎక్స్ టీమ్ పై తలైవా ప్రశంసలు

తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు సీక్వెల్ జిగర్ తండ డబుల్ ఎక్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమా రీసెంట్ గానే రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతంచేసుకుంది. ఇక ఈసినిమాపై తలైవా రజనీకాంత్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ప్రశంసించారు. జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ డిఫరెంట్ కథ, డిఫరెంట్ ప్లాట్.. కార్తీక్ సుబ్బరాజు అమేజింగ్ వర్క్ చేశావు.. కొన్ని సన్నివేశాలు మాత్రం ఇంతకుముందు సినిమా ఫ్యాన్స్ ఎప్పుడూ చూసినట్టు ఉండవు.. ఇక ఈసినిమాలో ప్రధాన పాత్రల్లో చేసిన రాఘవ లారెన్స్ అలానే ఎస్ జే సూర్య నటనను కూడా ప్రశంసించారు. ఈ రకమైన పాత్రలో…

TFN Adminవాట్సాప్
sai dharam tej about question and answer about tollywood celebrities
సినిమా వార్తలు

సమంత, ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి తేజ్ మాటల్లో

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తన కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న సినిమా గాంజా శంకర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మ్యాడ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. రిషి పంజాబీ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
rakshit shetty about tollywood star heroes
సినిమా వార్తలు

స్టార్ హీరోలతో అలాంటి జోనర్లలో సినిమాలు తీస్తా

హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయింది. దీంతో ఇక్కడ కూడా రిలీజ్ చేయగా ఇక్కడ కూడా హిట్ అయింది. ఈసినిమా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్ 17వ తేదీన ఈపార్ట్ ను రిలీజ్ చేయనున్నారు. సప్త సాగరాలు దాటి-సైడ్ బి అంటూ తెలుగులో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు.

TFN Adminవాట్సాప్
sai dharam tej about mass films
సినిమా వార్తలు

మాస్ సినిమాలు నా ఫేవరెట్ జోనర్

సాయి ధరమ్ తేజ్ ఈమధ్య కాస్త విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ తన అభిమానులను అలరిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే విరూపాక్ష, బ్రో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. ప్రస్తుతం మరో కొత్త సినిమాతో బిజీ అయిపోయాడు.

TFN Adminవాట్సాప్
Mangalavaaram will have a sequel as well.
సినిమా వార్తలు

మంగళవారంకు సీక్వెల్ కూడా

సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు సీక్వెల్స్ కామన్ అయిపోయాయి.రిజల్ట్ తో సంబంధం లేకుండా సీక్వెల్ కూడా ఉందంటూ ముందే చెప్పేస్తున్నారు.ఈ జాబితాలో మరో సినిమా చేరింది అదే మంగళవారం.ఆర్ ఎక్స్ 100ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన సినిమా ఇది.ఈవారం మంచి హైప్ తో విడుదలకానుంది.ఇక ఈసినిమాకు కూడా సీక్వెల్ ఉంటుందని అజయ్ భూపతి లేటెస్ట్ గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

Mahender Reddyవాట్సాప్
childrens day special poster released from saindhav movie
ఫస్ట్ లుక్

సైంధవ్- చిల్డ్రన్స్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం వెంకీ నుండి రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ సైంధవ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
hanuman movie first single released
సాంగ్

హనుమాన్ నుండి సూపర్ హీరో హనుమాన్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటినుండీ డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అ!, కల్కి, జాంబిరెడ్డి ఇలా వేటికవే ప్రత్యేకమైన జోనర్లో వచ్చినవే. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ జోనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఈసినిమా ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.

TFN Adminవాట్సాప్
tiger 3 two days collections
బాక్సాఫీస్

రెండో రోజు టైగర్ 3 కి షాకింగ్ కలెక్షన్స్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.దీపావళికి థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా రెండో రోజు మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.నిన్న కొన్ని చోట్ల సెలువు కూడా కావడం సినిమాకు బాగా కలిసొచ్చింది.మొదటి రోజు ఇండియాలో 43కోట్ల నెట్ ను రాబట్టిన ఈసినిమా రెండో 58కోట్లతో రెండు రోజుల్లోనే 101 కోట్లను రాబట్టింది.

Mahender Reddyవాట్సాప్
Ranbir Kapoor and Animal Movie Team Meet Nandamuri Balakrishna
సినిమా వార్తలు

అద్దిరిపోయే న్యూస్.. బాలకృష్ణ షోలో యానిమల్ టీమ్ సందడి

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్‌ కపూర్ నటిస్తోన్న తాజా చిత్రం 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. మరో ప్రముఖ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నారు. కాగా 'యానిమల్' చిత్రాన్ని టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
800 movie ott release date fixed
ఓటీటీ

800 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ రియల్ స్టోరీ ఆధారంగా 800 అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే కదా. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మధుర్ మిట్టల్ ప్రధాన పాత్రలో ఈసినిమా వచ్చింది. ఇక ఈమధ్యే ఈసినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈసినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ ను రాలేదు. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమా వారు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోని తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2వ తేదీన ఈసినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
Vennela Kishore's First Look Released From Chaari 111 Movie
ఫస్ట్ లుక్

చారి 111గా.. జేమ్స్ బాండ్‌ లుక్‌లో వెన్నెల కిశోర్

టాలీవుడ్ స్టార్ కమెడియన్ 'వెన్నెల' కిశోర్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'చారి 111'. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా 'మళ్ళీ మొదలైంది' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తుండగా.. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ స్పై గా నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.

Srikanth Mవాట్సాప్
Appadappada Thaandra video song out from Mangalavaaram movie
సాంగ్

మంగళవారం- అప్పడప్పడ తాండ్ర వీడియో సాంగ్ రిలీజ్

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వస్తున్న సినిమా మంగళవారం. ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి కంటెంట్ ఒరియెంటెండ్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈ మూవీ నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తు సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Nandamuri Chaitanya Krishna Breath trailer out now
ట్రైలర్ & టీజర్

ఇంటెన్స్ ఎమోషన్స్ తో బ్రీత్ ట్రైలర్

సినీ ఇండస్ట్రీలో వారసులు రావడం అంటే కామన్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పటికే ఎంతో మంది వారసులు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక నందమూరి తారకరామారావు వారసత్వంతో కూడా ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. రామారావు తరువాత హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా వచ్చిన సంగతి తెలిసిందే కదా. వీరిద్దరూ అగ్ర కథానాయకులుగా తండ్రి తగ్గ తనయులు అనిపించుకున్నారు. మూడో తరంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ టాప్ హీరోలయ్యారు.

TFN Adminవాట్సాప్
Jr NTR's Devara Movie New Schedule Begins From Today
షూటింగ్ అప్‌డేట్

నేటి నుండి దేవర కొత్త షెడ్యూల్ షురూ

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ 'దేవర'. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కాగా 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికితోడు.. వరల్డ్‌వైడ్‌ బ్లాక్ బస్టర్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా 'దేవర'పై అంతటా ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే పలు…

Srikanth Mవాట్సాప్
Music Sittings Begin For Nagarjuna's Naa Saami Ranga
సినిమా వార్తలు

పాటల సందడిలో.. నాగార్జున నా సామిరంగా

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'నా సామిరంగా'. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. 'నేను లోకల్‌', 'ధమాకా' సినిమాలకు పని చేసిన ప్రసన్న కుమార్‌ బెజవాడ ఈ సినిమాకు కథనందించగా.. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
nani Saripodhaa Sanivaaram shooting started
షూటింగ్ అప్‌డేట్

యాక్షన్ ఎపిసోడ్ తో సరిపోదా శనివారం షూట్ షురూ

న్యాచురల్ స్టార్ నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ప్రధమార్థంలో దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకోగా.. ఇప్పుడు ఏడాది చివరిలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శౌర్యువ్‌ దర్శకత్వంలో నాని హీరోగా రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా హాయ్ నాన్న. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ కానుంది

TFN Adminవాట్సాప్
Nanna Nuv Naa Pranam Song Out From Ranbir Kapoor's Animal Movie
సాంగ్

రణబీర్ కపూర్ యానిమల్ మూవీ నుండి.. 'నాన్నా నువ్వు నా ప్రాణం' సాంగ్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్‌ కపూర్ నటిస్తోన్న తాజా చిత్రం 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్‌ వైలెంట్‌ యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి ముందు సందీప్ వంగా షాహిద్ కపూర్‌తో చేసిన 'కబీర్ సింగ్' సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ అందుకోవడంతో దీనిపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. కాగా 'యానిమల్' చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. మరో ప్రముఖ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Hanuman Next Song out on NOV 14th
సాంగ్

హనుమాన్ నుండి సాంగ్ రానుంది

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా హనుమాన్.తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు.ఈసినిమా సంక్రాంతి బరిలో నిలిచింది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా లోని సూపర్ హీరో హనుమాన్ అనే సాంగ్ ను రేపు సాయంత్రం 5:04 గంటలకు విడుదలచేయనున్నారు. విజువల్ ప్రెజెంటేషన్ పరంగా ఇది ఎక్సయిటింగ్ ఫ్యాన్సీ నెంబర్ గా ఉంటుంది. ఈసందర్భంగా విడుదల చేసిన సినిమాలోని పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
Icon star Allu Arjun Gives Crazy Update About Pushpa 2 Movie
సినిమా వార్తలు

పుష్ప 2 గురించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాస్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప: ది రైజ్‌’ తొలిభాగం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌లో సైతం సత్తా చాటి హిందీ బెల్ట్‌లో రూ.100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా ‘పుష్ప 2: ది రూల్' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అల్లు అర్జున్‌ సరసన కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, రావు రమేష్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా చేస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. క్రియేటివ్…

Srikanth Mవాట్సాప్

షేర్