
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 76


`విక్రమార్కుడు` సీక్వెల్ రానుందా?

ఒలింపిక్ విన్నర్ తో వరుణ్ ట్రైనింగ్

కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్

ముగ్గురు సూపర్ స్టార్ల రేర్ కాంబినేషన్

`ఎన్జీకే` రిలీజ్ డేట్ మారిందా?

అప్పుడు కార్తితో... ఇప్పుడు సూర్యతో...

మరో రీమేక్‌లో కియరా అద్వాని?

మహేష్ బాబు కు సుక్కుతో సృజనాత్మక విభేదాలు

`చిత్రలహరి` కాన్సెప్ట్ అదేనా..?

బైక్ రేసర్‌గా విజయ్ దేవరకొండ?

శర్వానంద్ - కాజల్ మూవీ టైటిల్ అప్‌డేట్

సంతానం ఏ1మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

బాలీవుడ్ వెళుతున్న కీర్తి సురేష్?

విజయ్ దేవరకొండ చిత్రంలో నయనతార?

రెండో షెడ్యూల్ లో ‘‘అక్షర’’

నాని సినిమాలో... కార్ రేసర్‌గా కార్తికేయ?

నాగ్ డైరెక్టర్‌తో చైతూ చిత్రం?
`సంతోషం`... కింగ్ నాగార్జున కెరీర్‌లో మెమరబుల్ ఫిల్మ్. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించడమే కాకుండా... పలు పురస్కారాలను అందుకుంది. అలాంటి... ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తోనే దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు దశరథ్. ఆ తరువాత దశరథ్ డైరెక్షన్‌లో వచ్చిన `సంబరం`, `శ్రీ`, `స్వాగతం` ఆశించిన విజయాలను సాధించకపోయినా... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో రూపొందించిన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `మిస్టర్ పర్‌ఫెక్ట్`... దశరథ్‌ని మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకువచ్చింది. అలాగే... తన తొలి చిత్ర కథానాయకుడు నాగ్‌తో…

`విక్రమార్కుడు` సీక్వెల్ రానుందా?
మాస్ మహరాజా రవితేజ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రం `విక్రమార్కుడు`. విక్రమ్ సింగ్ రాథోడ్, అత్తిలి సత్తిబాబు... ఇలా రెండు విభిన్న పాత్రల్లో ఆయన దర్శనమిచ్చాడు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్... అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలచింది. అంతేకాదు... తమిళ, హిందీ, కన్నడ, బెంగాలి, ఉర్దూ భాషల్లోనూ రీమేక్ అయి ఆదరణ పొందింది. అలాంటి `విక్రమార్కుడు`కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జరుగుతోందని టాలీవుడ్ టాక్.

ఒలింపిక్ విన్నర్ తో వరుణ్ ట్రైనింగ్
ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మొదటి సినిమా నుండే ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఇక ఇదే జోష్ తో మరో సినిమా కోసం అప్పుడే కసరత్తులు మొదలుపెట్టేశాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం అప్పుడే ట్రైనింగ్ కూడా మొదలు పెట్టాడు.

కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్
బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు ఎంత పెద్ద ఘన విజయం సాధించాయో అందరికీ తెలుసు. యాక్షన్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కిన ఈ సినిమాలు ఒక ట్రెండ్ సెట్ చేశాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే.

ముగ్గురు సూపర్ స్టార్ల రేర్ కాంబినేషన్
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మహర్షి పూర్తయిన వెంటనే మహేష్ బాబు తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉంటుందన్న విషయం తెలిసిందే. దిల్ రాజు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ముగ్గురు సూపర్ స్టార్ల రేర్ కాంబినేషన్ కు వేదిక కానున్నదన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. "లేడీ సూపర్ స్టార్- రాములమ్మ" విజయశాంతి, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు చిత్రం కేన్సిల్ అవటంతో ఈ చిత్రం ఇమిడియట్ గా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు సరసన హీరోయిన్ గా రష్మిక మందన కూడా…

`ఎన్జీకే` రిలీజ్ డేట్ మారిందా?
కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `ఎన్జీకే`. సూర్యకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి నటిస్తున్న ఈ సినిమాకి శ్రీ రాఘవ దర్శకత్వం వహిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్... ఇటీవలే విడుదలై ఆసక్తిని రేకెత్తించింది.

అప్పుడు కార్తితో... ఇప్పుడు సూర్యతో...
గోపీచంద్ హీరోగా నటించిన `శౌర్యం` (2008) చిత్రంతో దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ శివ... ప్రస్తుతం కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్. ముఖ్యంగా అజిత్ కాంబినేషన్‌లో శివ రూపొందించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. `వీరం`, `వేదాళం`, `వివేగమ్`, `విశ్వాసం`... ఇలా అజిత్, శివ కాంబినేషన్ కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక సంక్రాంతికి వచ్చిన `విశ్వాసం` వారిద్దరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలచింది. ఈ నేపథ్యంలో... `విశ్వాసం` తరువాత శివ తదుపరి చిత్రం ఏంటనే విషయంపై ఆసక్తి నెలకొంది. కోలీవుడ్ స్టార్ విజయ్‌తో శివ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉండొచ్చన్న వార్తలు…

మరో రీమేక్‌లో కియరా అద్వాని?
`భరత్ అనే నేను`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ఉత్తరాది భామ కియరా అద్వాని. మొదటి సినిమాతోనే తెలుగునాట మంచి విజయాన్ని నమోదు చేసుకున్న కియరా... ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `వినయ విధేయ రామ`తోనూ అలరించింది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం హిందీ చిత్రాలతో బిజీగా ఉంది కియరా. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న `గుడ్ న్యూస్`లో ఓ కథానాయికగానూ... అలాగే ప్రతిష్ఠాత్మక చిత్రం `కళంక్`లో ప్రత్యేక గీతంలోనూ కనువిందు చేయనుంది. అంతేకాదు... `అర్జున్ రెడ్డి` హిందీ రీమేక్ `కబీర్ సింగ్`లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.

మహేష్ బాబు కు సుక్కుతో సృజనాత్మక విభేదాలు
ఈరోజు మధ్యాహ్నం వరకు అంతా సవ్యంగానే ఉంది. ప్రస్తుతం 'మహర్షి' చిత్ర నిర్మాణం చివరి దశలో ఉన్న తరుణంలో మహేష్ బాబు తదుపరి చిత్రాలు సీనియర్ డైరెక్టర్ సుకుమార్ తోను, రైసింగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితోను ఉంటాయనే వార్త ప్రచారంలో ఉంది. నిన్న కూడా సుకుమార్ చెప్పిన కథ ఫైనల్ వెర్షన్ మహేష్ బాబు విన్నారని, బాగుంది.. ఓకే అనుకున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ కొద్దిసేపటి క్రితం మహేష్ బాబు పెట్టిన ఒక ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. " క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సుకుమార్ దర్శకత్వంలో నేను చేయబోయే సినిమా జరగదు. సుకుమార్ నెక్స్ట్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. "1- నేనొక్కడినే" వంటి cult classic…

`చిత్రలహరి` కాన్సెప్ట్ అదేనా..?
`సుప్రీమ్` (2016) వంటి ఘనవిజయం తరువాత మళ్ళీ ఈ ఏడాది వేసవి బరిలోకి దిగుతున్నాడు మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్. `చిత్రలహరి` పేరుతో `నేను శైలజ` ఫేమ్ కిషోర్ తిరుమల రూపొందిస్తున్న ఈ సినిమా... ఏప్రిల్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్‌కి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.

తక్కువ గ్యాప్‌లో... రెండు చిత్రాలతో మహేష్ బాబు?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం `మహర్షి`ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ఈ సినిమా సెల్యులాయిడ్ పైకి రానుంది. ఆ తరువాత రెండు ఆసక్తికరమైన చిత్రాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు మహేష్. వాటిలో ఒకటి అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ కాగా... మరొకటి సుకుమార్ కాంబినేషన్ మూవీ. అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ జూలైలో ప్రారంభమై... 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం. అలాగే సుకుమార్ దర్శకత్వం వహించనున్న సినిమా... జూలై నెలాఖరులో లేదా ఆగస్టు ప్రథమార్ధంలో ప్రారంభమై 2020 వేసవికి రిలీజ్ కానుందని తెలుస్తోంది.

`రంగస్థలం`తో మళ్ళీ ఆ ట్రెండ్ స్టార్ట్ అవుతోంది
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిన చిత్రం `రంగస్థలం`. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ పిరియాడిక్ డ్రామా... తెలుగునాట సంచలన విజయం సాధించింది. అలాగే పలు రికార్డులకు కేంద్ర బిందువుగా నిలిచింది. అలాంటి `రంగస్థలం`... ఇతర దక్షిణాది భాషల్లోనూ డబ్బింగ్ రూపంలో ఆ యా చోట్ల తెరపైకి రానుంది. తమిళ, మలయాళ వెర్షన్స్‌తో పాటు కన్నడ భాషలోనూ ఈ సినిమా అనువాదం కానుంది.

బైక్ రేసర్‌గా విజయ్ దేవరకొండ?
`పెళ్ళి చూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం`, `టాక్సీవాలా` వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో యూత్ ఐకాన్ అయిపోయిన విజయ్ దేవరకొండ... ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న `డియర్ కామ్రేడ్` కాగా... మరొకటి సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ రూపొందిస్తున్న పేరు నిర్ణయించని సినిమా. ఈ రెండు చిత్రాలూ ఈ ఏడాదిలోనే తెరపైకి రానున్నాయి. ఒకవైపు ఈ చిత్రాలతో బిజీగా ఉంటూనే... మరో వైపు కొత్త ప్రాజెక్ట్‌లకు కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని తెలిసింది.

శర్వానంద్ - కాజల్ మూవీ టైటిల్ అప్‌డేట్
యంగ్ హీరో శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్ లుక్‌తో పాటు యంగ్ లుక్ కూడా ఉంటుందని సమాచారం. కాగా... ఇందులో శర్వాకి జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌తో పాటు `హలో` భామ కళ్యాణి ప్రియదర్శన్ కూడా నటిస్తోంది.

సంతానం ఏ1మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
కమెడియన్ గా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించిన సంతానం ప్రధాన పాత్రలో ఏ1 () అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. జాన్సన్ దర్శకత్వంలో సంతానం, తారా అలీషా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సర్కిల్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రాజ్ నారాయణన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో సంతానం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

బాలీవుడ్ వెళుతున్న కీర్తి సురేష్?
గతేడాది వేసవి కానుకగా విడుదలైన `మహానటి`తో నటిగా ఎనలేని గుర్తింపుని తెచ్చుకుంది కేరళకుట్టి కీర్తి సురేష్. తెలుగునాట సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్న ఈ అందాల తార... తమిళ సీమలో మాత్రం అగ్ర కథానాయకుల పక్కన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తారాపథంలో దూసుకుపోతోంది. ఇప్పటికే విజయ్, విక్రమ్, సూర్య వంటి టాప్ హీరోలతో ఆడిపాడిన కీర్తి... త్వరలో సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన కూడా దర్శనమివ్వనుందని కోలీవుడ్ టాక్.

విజయ్ దేవరకొండ చిత్రంలో నయనతార?
తెలుగు రాష్ట్రాల్లో యంగ్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ స్థాయిలో కాకపోయినా... తమిళనాడులోనూ ఈ యంగ్ సెన్సేషన్‌కి మంచి క్రేజ్ ఉంది. `గీత గోవిందం`కి అక్కడ దక్కిన ఆదరణ చూస్తే... ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

రెండో షెడ్యూల్ లో ‘‘అక్షర’’
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నందిత శ్వేత ప్రస్తుతం ప్రేమ కథా చిత్రమ్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ హారర్ గా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రమ్ కు సీక్వెల్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. దానితో పాటు నందిత అక్షర్ అనే మరో థ్రిల్లర్ మూవీలో కూడా నటిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజా అప్ డేట్ ఏంటంటే.. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని.. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటోంది.

నాని సినిమాలో... కార్ రేసర్‌గా కార్తికేయ?
గత ఏడాది విడుదలైన `ఆర్ ఎక్స్ 100`తో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న యువ కథానాయకుడు కార్తికేయ. ప్రస్తుతం ఈ యంగ్ హీరో `హిప్పీ` అనే బైలింగ్వల్ ప్రాజెక్ట్‌తో పాటు మరో సినిమాలోనూ కథానాయకుడిగానూ నటిస్తున్నాడు. అంతేకాదు... తాజాగా పట్టాలెక్కిన నేచురల్ స్టార్ నాని, బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ మూవీలోనూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

వేర్వేరు నేపథ్యాలతో విజయ్ దేవరకొండ నెక్ట్స్ ప్రాజెక్ట్స్
గత ఏడాది `గీత గోవిందం`, `టాక్సీవాలా` చిత్రాలతో ఘనవిజయాలను అందుకున్న యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ... ఈ సంవత్సరం రెండు సినిమాలతో సందడి చేయనున్నాడు. అందులో ఒకటి నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న `డియర్ కామ్రేడ్` కాగా... మరొకటి సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ రూపొందిస్తున్న పేరు నిర్ణయించని సినిమా. ఈ రెండు సినిమాలు కూడా... వేర్వేరు నేపథ్యాలతో తెరకెక్కుతున్నాయని సమాచారం.