`భరత్ అనే నేను`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ఉత్తరాది భామ కియరా అద్వాని. మొదటి సినిమాతోనే తెలుగునాట మంచి విజయాన్ని నమోదు చేసుకున్న కియరా… ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `వినయ విధేయ రామ`తోనూ అలరించింది. ఇదిలా ఉంటే… ప్రస్తుతం హిందీ చిత్రాలతో బిజీగా ఉంది కియరా. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న `గుడ్ న్యూస్`లో ఓ కథానాయికగానూ… అలాగే ప్రతిష్ఠాత్మక చిత్రం `కళంక్`లో ప్రత్యేక గీతంలోనూ కనువిందు చేయనుంది. అంతేకాదు… `అర్జున్ రెడ్డి` హిందీ రీమేక్ `కబీర్ సింగ్`లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమచారం ప్రకారం… కియరా మరో రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే… 2011లో విడుదలై తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన `కాంచన` చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయనున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించనుండగా… కథానాయిక పాత్రకు కియరా ఎంపికైందని సమాచారం. ఏప్రిల్ నుంచి పట్టాలెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మరి… `అర్జున్ రెడ్డి`, `కాంచన` రీమేక్‌లతో కియరా… బాలీవుడ్‌లో తన స్థాయిని మరింతగా పెంచుకుంటుందేమో చూడాలి.
[youtube_video videoid=EPhHbH7FR74]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: