గోపీచంద్ హీరోగా నటించిన `శౌర్యం` (2008) చిత్రంతో దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ శివ… ప్రస్తుతం కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్. ముఖ్యంగా అజిత్ కాంబినేషన్‌లో శివ రూపొందించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. `వీరం`, `వేదాళం`, `వివేగమ్`, `విశ్వాసం`… ఇలా అజిత్, శివ కాంబినేషన్ కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక సంక్రాంతికి వచ్చిన `విశ్వాసం` వారిద్దరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలచింది. ఈ నేపథ్యంలో… `విశ్వాసం` తరువాత శివ తదుపరి చిత్రం ఏంటనే విషయంపై ఆసక్తి నెలకొంది. కోలీవుడ్ స్టార్ విజయ్‌తో శివ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉండొచ్చన్న వార్తలు ప్రముఖంగా వినిపించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే… అనూహ్యంగా మరో స్టార్ హీరో సూర్యతో శివ తదుపరి సినిమా ఉండబోతుందని కథనాలు వస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే… సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం సూర్య తమ్ముడు కార్తి కాంబినేషన్‌లో `సిరుత్తై` (`విక్రమార్కుడు` రీమేక్) చిత్రాన్ని రూపొందించి ఘనవిజయాన్ని అందుకున్నాడు శివ. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత ఆ ఫ్యామిలీ హీరో సూర్యతో శివ జట్టుకట్టనుండడం వార్తల్లో నిలుస్తోంది. త్వరలోనే సూర్య, శివ కాంబినేషన్‌పై క్లారిటీ వస్తుంది.
[youtube_video videoid=0y2hpww0EDM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: