`ఎన్జీకే` రిలీజ్ డేట్ మారిందా?

Change In Suriya NGK Movie Release Date?,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,NGK Movie Updates,NGK Movie Latest News,Hero Suriya NGK Movie Release Date Postponed,Actor Suriya NGK Movie Release Date Changed
Change In Suriya NGK Movie Release Date?

కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఎన్జీకే`. సూర్య‌కి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్న ఈ సినిమాకి శ్రీ రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత‌మందిస్తున్నాడు. పొలిటిక‌ల్ యాక్ష‌న్‌ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్‌… ఇటీవ‌లే విడుద‌లై ఆస‌క్తిని రేకెత్తించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… త‌మిళ సంవ‌త్స‌రాదిని పుర‌స్క‌రించుకుని `ఎన్జీకే`ని ఏప్రిల్ రెండో వారంలో విడుద‌ల చేయ‌బోతున్నట్లు ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. అయితే… ఇప్పుడు రిలీజ్ డేట్ మారింద‌ని కోలీవుడ్ టాక్‌. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… రంజాన్ సంద‌ర్భంగా జూన్ 5న గానీ లేదా 6న గానీ ఈ సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీపై క్లారిటీ రావ‌చ్చు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్‌.ఆర్‌.ప్ర‌కాష్ బాబు, ఎస్‌.ఆర్‌. ప్ర‌భు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=0y2hpww0EDM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =