ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మొదటి సినిమా నుండే ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఇక ఇదే జోష్ తో మరో సినిమా కోసం అప్పుడే కసరత్తులు మొదలుపెట్టేశాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం అప్పుడే ట్రైనింగ్ కూడా మొదలు పెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఏదో నార్మల్ గా కాకుండా ఈ సినిమా కోసం వరుణ్ బాగానే కష్టపడుతున్నట్టు ఉన్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. థ్రిల్లింగ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు.
కాగా ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ జిగర్తాండ రీమేక్‌గా వాల్మీకీ సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ సినిమా చేస్తూనే వరుణ్.. కిరణ్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.
Training starts now! 👊🏽👊🏽👊🏽
#losangeles#boxing pic.twitter.com/JeT24IMJVB— Varun Tej Konidela (@IAmVarunTej) 6 February 2019
[youtube_video videoid=kx20Cf63drM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: