గతేడాది వేసవి కానుకగా విడుదలైన `మహానటి`తో నటిగా ఎనలేని గుర్తింపుని తెచ్చుకుంది కేరళకుట్టి కీర్తి సురేష్. తెలుగునాట సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్న ఈ అందాల తార… తమిళ సీమలో మాత్రం అగ్ర కథానాయకుల పక్కన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తారాపథంలో దూసుకుపోతోంది. ఇప్పటికే విజయ్, విక్రమ్, సూర్య వంటి టాప్ హీరోలతో ఆడిపాడిన కీర్తి… త్వరలో సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన కూడా దర్శనమివ్వనుందని కోలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… కన్నడ పరిశ్రమను మినహాయిస్తే మిగిలిన దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించిన కీర్తికి… ఇప్పుడు ఓ బాలీవుడ్ ఆఫర్ తలుపు తట్టిందట. ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని నిర్మించనున్నారని… నిరుడు `బదాయి హో` వంటి బ్లాక్‌బస్టర్ మూవీని అందించిన అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారానే కీర్తి హిందీ నాట తొలి అడుగులు వేయబోతోందని సమాచారం. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడతాయి. మరి… దక్షిణాది ప్రేక్షకులని అలరించిన కీర్తి… ఉత్తరాది వారిని కూడా మురిపిస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=fQhu517vBRw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: