`పెళ్ళి చూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం`, `టాక్సీవాలా` వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో యూత్ ఐకాన్ అయిపోయిన విజయ్ దేవరకొండ… ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న `డియర్ కామ్రేడ్` కాగా… మరొకటి సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ రూపొందిస్తున్న పేరు నిర్ణయించని సినిమా. ఈ రెండు చిత్రాలూ ఈ ఏడాదిలోనే తెరపైకి రానున్నాయి. ఒకవైపు ఈ చిత్రాలతో బిజీగా ఉంటూనే… మరో వైపు కొత్త ప్రాజెక్ట్‌లకు కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ప్రముఖ తమిళ నిర్మాత ఎస్.ఆర్.ప్రభు నిర్మాణంలో ఓ బైలింగ్వల్ మూవీకి విజయ్ ఓకే చెప్పాడని… అలాగే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ మరో ప్రాజెక్ట్ చేయడానికి ఈ యంగ్ హీరో అంగీకరించాడని టాలీవుడ్ టాక్. అంతేకాదు… మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న చిత్రంలో బైక్ రేసర్ పాత్రలో విజయ్ కనిపిస్తాడని… ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోనున్నాడని సమాచారం. అలాగే ఈ సినిమాకి `హీరో` అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలిసింది. తమిళ చిత్రం `కాక ముట్టై`కి మాటల రచయితగా పనిచేసిన ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా మాళవికా మోహనన్ నటించనుందట. త్వరలోనే ఈ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
[youtube_video videoid=1ZLTAIfJzvc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: