సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం `మహర్షి`ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ఈ సినిమా సెల్యులాయిడ్ పైకి రానుంది. ఆ తరువాత రెండు ఆసక్తికరమైన చిత్రాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు మహేష్. వాటిలో ఒకటి అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ కాగా… మరొకటి సుకుమార్ కాంబినేషన్ మూవీ. అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ జూలైలో ప్రారంభమై… 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం. అలాగే సుకుమార్ దర్శకత్వం వహించనున్న సినిమా… జూలై నెలాఖరులో లేదా ఆగస్టు ప్రథమార్ధంలో ప్రారంభమై 2020 వేసవికి రిలీజ్ కానుందని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంటే… తక్కువ గ్యాప్‌లోనే 2020లో రెండు సినిమాలతో పలకరించనున్నాడట మహేష్. మొత్తమ్మీద… 2000, 2002, 2003, 2004, 2006, 2014 తరువాత ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో పలకరించనున్న వైనం… మళ్ళీ 2020లో మహేష్ రిపీట్ చేయనున్నాడన్నమాట. మరి… ఈ రెండు చిత్రాలతో మహేష్ మంచి విజయాలను నమోదు చేసుకుంటాడేమో చూడాలి.
[youtube_video videoid=_WbC7rfDL9c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: