యంగ్ హీరో శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్ లుక్‌తో పాటు యంగ్ లుక్ కూడా ఉంటుందని సమాచారం. కాగా… ఇందులో శర్వాకి జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌తో పాటు `హలో` భామ కళ్యాణి ప్రియదర్శన్ కూడా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్‌ని శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 6న ప్రకటించనున్నారని తెలిసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాని మే నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రంతో పాటు శర్వానంద్… `96` రీమేక్‌లోనూ నటించనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమా ఆగస్టులో తెరపైకి రానుందని సమాచారం.
[youtube_video videoid=cXlGET2oQh0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: