
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 75


హారర్ కామెడీ సినిమాలో జాన్వీ కపూర్

దేవిశ్రీ ప్రసాద్ తొలి చిత్రం `దేవి`కి 20 ఏళ్ళు

కళ్యాణి ప్రియదర్శన్... డబుల్ ధమాకా

రిలీజ్ కానున్న చిత్రలహరి మూవీ టీజర్

మణిరత్నం మూవీ లో మరో స్టార్ హీరో

మరో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న మహర్షి

ఆకాష్ హీరోయిన్ గా ఢిల్లీ భామ!

టర్కిష్ సినిమా రీమేక్ లో!

మరోసారి కూలీ నెం.1 రీమేక్ ప్లాన్!

ప్రేమకథా చిత్రమ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్

బ్రహ్మస్త్ర తెలుగు టైటిల్ లోగో రిలీజ్

ఓటర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

నాగార్జున `విక్కీదాదా`కి 30 ఏళ్ళు

`బాయ్స్`కి సీక్వెల్ రానుందా?

మరో భక్తి చిత్రంలో అనుష్క?

ఈ ఏడాది రెండు సినిమాలతో.. రవితేజ

`తుగ్లక్`గా కళ్యాణ్ రామ్?

ముంబై నేపథ్యంలో రజనీ కొత్త చిత్రం?
సూపర్ స్టార్ రజనీ కాంత్... వరుస సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ పెంచుతున్నాడు. తాజాగా కేవలం ఎనిమిది నెలల గ్యాప్‌లోనే `కాలా`, `2.0`, `పేట` చిత్రాలతో పలకరించి... ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. ఇదే ఊపులో... తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడీ సూపర్ స్టార్. బ్రిలియంట్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రజనీ డబుల్ రోల్‌లో సందడి చేయబోతున్నాడు. అందులో ఒకటి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ రోల్ కాగా... మరొకటి సోషల్ వర్కర్ రోల్ అని టాక్. అలాగే... రజనీకి జోడీగా నయనతార, కీర్తి సురేష్ నటించబోతున్నారు.

హారర్ కామెడీ సినిమాలో జాన్వీ కపూర్
`అతిలోక సుందరి శ్రీదేవి తనయ` అనే ట్యాగ్‌తో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తొలి చిత్రం `ధడక్`తో నటిగా మెప్పించిన జాన్వి... ప్రస్తుతం `కార్గిల్ గాళ్`, `తఖ్త్` చిత్రాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ సమాచారం ప్రకారం... ఈ టాలెంటెడ్ బ్యూటీ మరో ఆసక్తికరమైన చిత్రానికి సంతకం చేసిందని తెలిసింది.

దేవిశ్రీ ప్రసాద్ తొలి చిత్రం `దేవి`కి 20 ఏళ్ళు
మంచి కథకు సాంకేతికత కూడా తోడైతే... వెండితెరపైన అద్భుతాలు చోటుచేసుకుంటాయి. అలా... తెలుగు తెరపై అద్భుతాలు ఆవిష్కరించిన దర్శకుడు స్వర్గీయ కోడి రామకృష్ణ. భక్తి రస చిత్రాలకు ఆధునిక సాంకేతికతను జోడించి... ఆయన రూపొందించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అలాంటి చిత్రాలలో `దేవి` ఒకటి. తనను కాపాడే సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఓ ఆసామి పట్ల కృతజ్ఞతతో... అతని కూతురిని దుష్టశక్తుల బారి నుంచి నిరంతరం రక్షించే ఓ నాగదేవత కథగా `దేవి` తెరకెక్కింది. ప్రేమ టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో భానుచందర్, సిజ్జూ, వనిత, అబూ సలీమ్, షావుకారు జానకి…

కళ్యాణి ప్రియదర్శన్... డబుల్ ధమాకా
`హలో` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కేరళకుట్టి కళ్యాణి ప్రియదర్శన్. మొదటి సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా... నటిగా మంచి గుర్తింపునే తెచ్చుకుంది కళ్యాణి. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలుపుకుని మొత్తం ఐదు చిత్రాలతో బిజీగా ఉంది. వీటిలో రెండు తెలుగు చిత్రాలు ఉండడం విశేషం. అందులో ఒకటి... మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న `చిత్రలహరి` కాగా... మరొకటి టాలెంటెడ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న పేరు నిర్ణయించని సినిమా.

రిలీజ్ కానున్న చిత్రలహరి మూవీ టీజర్
నేను శైలజ వంటి సూపర్ హిట్ మూవీ దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరో గా చిత్రలహరి మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందింది. కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ కథానాయికలు. టాప్ కమెడియన్స్ సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మణిరత్నం మూవీ లో మరో స్టార్ హీరో
నాయకన్, అంజలి, దళపతి, రోజా, బాంబే, కణ్ణత్తిల్ ముత్తమిట్టాల్, చెక్క చివంద వానమ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ రూపొందించిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం రాజ రాజ చోళన్ రాజవంశం నేపథ్యంలో ఒక మూవీ రూపొందించనున్నారు. కల్కి కృష్ణమూర్తి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఈ మూవీ రూపొందనుంది.

మరో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న మహర్షి
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. అటు మహేష్ అభిమానులే కాదు.. ప్రతి సినీ ప్రేక్షకుడు మోస్ట్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్న సినిమా మహర్షి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి క్లారిటీ ఇచ్చేశారు చిత్ర యూనిట్. ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆకాష్ హీరోయిన్ గా ఢిల్లీ భామ!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ 'రొమాంటిక్' అనే కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ పడూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

టర్కిష్ సినిమా రీమేక్ లో!
సినీ కెరీర్ ప్రారంభంలోనే మంచి విజయాలను అందుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆ తరువాత వరుస అపజయాలతో కాస్త వెనకబడ్డాడు. చాలా కాలం నుండి ఒక్క సినిమా కూడా తీయకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న తరువాత మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే గతంలో చేసినట్టు కాకుండా.. ఈసారి ఆచితూచి ముందడుగు వేయాలని భావిస్తున్న రాజ్ తరుణ్ కథల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

మజిలీ నుండి ప్రియతమా లిరికల్ సాంగ్ రిలీజ్
‘ఏ మాయ చేసావే’ ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన రీల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ జంట నాగ చైతన్య, సమంత పెళ్లి తరువాత మరోసారి మజిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది.

మరోసారి కూలీ నెం.1 రీమేక్ ప్లాన్!
వెంకటేష్, టబు హీరో హీరోయిన్లుగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1991 లో వచ్చిన కూలీ నెం. 1 సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇక ఈ సినిమాను అప్పట్లో బాలీవుడ్ లో కూడా రీమేక్ చేశారు. హిందీలో గోవింద, కరిష్మా కపూర్ లను హీరో హీరోయిన్లుగా పెట్టి డేవిడ్ దావన్ ఈ సినిమాను 1995 రీమేక్ చేయగా.. అక్కడ కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది.

ప్రేమకథా చిత్రమ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్
మారుతి దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు, నందిత జంటగా 2013లో వచ్చిన హారర్ కామెడీ ప్రేమకథా చిత్రమ్ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ప్రేమకథా చిత్రమ్ -2 బ్యాక్ టు ఫియర్ అనే క్యాప్షన్ తో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సీక్వెల్ పై కూడా అంచనాలు బాగానే ఏర్పడ్డాయి.

బ్రహ్మస్త్ర తెలుగు టైటిల్ లోగో రిలీజ్
చాలా కాలం తరువాత నాగార్జున బాలీవుడ్ లో బ్రహ్మస్త్ర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్‌కపూర్, అలియాభట్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఓటర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కామెడీ, యాక్షన్, కుటుంబ కథా చిత్రాలతో ఇన్ని రోజులు ప్రేక్షకులను అలరించిన మంచు విష్ణు ఇప్పుడు కొత్తగా పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమాతో వస్తున్నాడు. జి.ఎస్.కార్తిక్ దర్శకత్వంలో వస్తున్న ఓటర్ అనే సినిమాలో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మంచు విష్ణు కెరీర్ లోన్ తొలిసారిగా నటిస్తున్న పొలిటికల్ డ్రామా ఇది. ఇక గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

నాగార్జున `విక్కీదాదా`కి 30 ఏళ్ళు
కింగ్ నాగార్జున - కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో `విక్కీ దాదా` ఒకటి. నాగార్జునకి కలిసొచ్చిన దర్శకులలో ఒకరైన ఎ.కోదండరామిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నాగ్‌కి జోడీగా జూహీ చావ్లా, రాధ నటించిన ఈ చిత్రంలో కన్నడ ప్రభాకర్, గొల్లపూడి మారుతి రావు, గిరి బాబు, రంగనాథ్, కోట శ్రీనివాసరావు, శ్రీవిద్య, వరలక్ష్మి, కల్పనా రాయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. యండమూరి వీరేంధ్రనాథ్ కథను అందించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే ని, గణేష్ పాత్రో సంభాషణలను అందించారు. రాజ్…

`బాయ్స్`కి సీక్వెల్ రానుందా?
దక్షిణాది సినిమాకి కొత్త నడకలు నేర్పించిన దర్శకులలో శంకర్ ఒకడు. తొలి చిత్రం `జెంటిల్ మేన్` నుంచి తాజాగా విడుదలైన `2.0` వరకు పలు విజయవంతమైన చిత్రాలను అందించిన ఘనత శంకర్‌ది. అంతేకాదు... సంగీతం పరంగానూ, సాంకేతికంగానూ ఆయన సినిమాలు ఉన్నతంగా ఉండి అలరించాయి. కాగా... యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని తెరకెక్కించిన యూత్‌ఫుల్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ `బాయ్స్` అయితే అప్పట్లో ఓ సెన్సేషన్. ఈ సినిమా ద్వారానే సిద్ధార్థ్, జెనీలియా హీరోహీరోయిన్లుగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అలాగే... నేటి సంచలన సంగీత దర్శకుడు తమన్ కూడా ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించిన…

మరో భక్తి చిత్రంలో అనుష్క?
అనుష్క... తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఓ వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో మెప్పిస్తూనే... మరో వైపు అగ్ర కథానాయకుల చిత్రాల్లోనూ కనువిందు చేస్తుంటుంది. అలాగే అతిథి పాత్రల్లోనూ, కీలక పాత్రల్లోనూ మురిపిస్తుంటుంది. ప్రస్తుతం `సైలెన్స్` అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్న అనుష్క... తాజాగా ఓ ఆసక్తికరమైన చిత్రంలో కీలక పాత్ర పోషించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.

ఈ ఏడాది రెండు సినిమాలతో.. రవితేజ
రవితేజ అంటే ఎంటర్‌టైన్‌మెంట్... ఎంటర్‌టైన్‌మెంట్ అంటే రవితేజ... ఇదీ రవితేజ అభిమానుల మాట. జయాపజయాలకు అతీతంగా వరుస సినిమాలతో సందడి చేసే నైజం ఈ మాస్ మహరాజా సొంతం. `రాజా ది గ్రేట్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన ఈ ఎవర్‌గ్రీన్ ఎనర్జిటిక్ స్టార్... గత ఏడాది మూడు చిత్రాలతో సందడి చేశాడు. `టచ్ చేసి చూడు`, `నేల టిక్కెట్టు`, `అమర్ అక్బర్ ఆంటొని` పేర్లతో విడుదలైన ఆ సినిమాలు నిరాశపరిచినా... రవితేజ మాత్రం తన అభిమానులను మురిపించాడు. కాగా... ఈ ఏడాది కూడా రవితేజ తన దూకుడును కొనసాగించనున్నాడు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చిత్రంలో నిధి అగర్వాల్?
`సవ్యసాచి` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నిధి అగర్వాల్. ఆ తరువాత `మిస్టర్ మజ్ను`లోనూ కనువిందు చేసింది. తొలి, మలి సినిమాల్లో అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్‌తో సందడి చేసి అలరించిన నిధి... ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్‌కి జోడీగా `ఇస్మార్ట్ శంకర్`లో నటిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సైంటిస్ట్ పాత్రలో దర్శనమివ్వనుంది నిధి. వేసవి కానుకగా మే నెలలో ఈ సినిమా తెరపైకి రానుంది.

`తుగ్లక్`గా కళ్యాణ్ రామ్?
`118` విజయం... నందమూరి కళ్యాణ్ రామ్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో... మరింత జోష్‌తో తన తదుపరి చిత్రాలకు సన్నధ్ధమవుతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. వినిపిస్తున్న కథనాల ప్రకారం... కళ్యాణ్ రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ డైరెక్షన్‌లో ఉంటుందని టాలీవుడ్ టాక్. అంతేకాదు... ఈ సినిమాని తన సొంత సంస్థ యన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ పై నిర్మించే అవకాశముందని సమాచారం. కాగా... సోషియో ఫాంటసీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి `తుగ్లక్` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అలాగే అవుట్ అండ్ అవుట్ హిలేరియస్…