గత ఏడాది `గీత గోవిందం`, `టాక్సీవాలా` చిత్రాలతో ఘనవిజయాలను అందుకున్న యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ… ఈ సంవత్సరం రెండు సినిమాలతో సందడి చేయనున్నాడు. అందులో ఒకటి నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న `డియర్ కామ్రేడ్` కాగా… మరొకటి సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ రూపొందిస్తున్న పేరు నిర్ణయించని సినిమా. ఈ రెండు సినిమాలు కూడా… వేర్వేరు నేపథ్యాలతో తెరకెక్కుతున్నాయని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `డియర్ కామ్రేడ్` చిత్రంలో స్టూడెంట్ లీడర్‌గా విజయ్ కనిపించనుండగా… ఈ సినిమా పూర్తిగా కాకినాడ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలిసింది. ఇక క్రాంతి మాధవ్ రూపొందిస్తున్న సినిమాలో సింగరేణి కార్మికుల కోసం పోరాడే యూనియన్ లీడర్‌గా దేవరకొండ దర్శనమివ్వనుండగా… ఈ చిత్రం తెలంగాణ అర్బన్ నేటివిటీతో ఉంటుందని టాక్. అంతేకాదు… ఈ సినిమాలో ఎనిమిదేళ్ళ పిల్లాడికి తండ్రిగా కనిపించనున్నాడట విజయ్. మరి… ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది.
కాగా… `డియర్ కామ్రేడ్`లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా… వేసవి కానుకగా మే నెలలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి రానుంది. ఇక క్రాంతి మాధవ్ చిత్రంలో విజయ్‌కి జోడీగా రాశీ ఖన్నా, కేథరిన్ ట్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లా నటిస్తుండగా… ఈ సినిమా ఏడాది చివరలో తెరపైకి రానుంది.
[youtube_video videoid=1ZLTAIfJzvc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: