`సుప్రీమ్` (2016) వంటి ఘనవిజయం తరువాత మళ్ళీ ఈ ఏడాది వేసవి బరిలోకి దిగుతున్నాడు మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్. `చిత్రలహరి` పేరుతో `నేను శైలజ` ఫేమ్ కిషోర్ తిరుమల రూపొందిస్తున్న ఈ సినిమా… ఏప్రిల్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్‌కి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమా కాన్సెప్ట్‌కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… రెండు సార్లు లవ్‌లో ఫెయిల్ అయిన ఓ యువకుడు… ఆ సమస్యలను అధిగమించి జీవితంలో ఎలా ఎదిగాడు అనే పాయింట్ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని టాక్. అలాగే… మొదట ఈ చిత్రాన్ని విషాదాంత కోణంలో నడపాలని దర్శకుడు భావించినా… మెగాస్టార్ చిరంజీవి సూచన మేరకు పాజిటివ్ క్లైమాక్స్‌తోనే చిత్రీకరించేలా ప్లాన్ చేశారని సమాచారం. మరి… `సుప్రీమ్` తరువాత విజయం లేని సాయిధరమ్‌కి `చిత్రలహరి` అయినా మంచి విజయం అందిస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=03Mk3HEzRdM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: