గత ఏడాది విడుదలైన `ఆర్ ఎక్స్ 100`తో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న యువ కథానాయకుడు కార్తికేయ. ప్రస్తుతం ఈ యంగ్ హీరో `హిప్పీ` అనే బైలింగ్వల్ ప్రాజెక్ట్‌తో పాటు మరో సినిమాలోనూ కథానాయకుడిగానూ నటిస్తున్నాడు. అంతేకాదు… తాజాగా పట్టాలెక్కిన నేచురల్ స్టార్ నాని, బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ మూవీలోనూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… నాని సినిమాలో కార్తికేయ పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఇందులో కార్తికేయ కార్ రేసర్ పాత్రలో దర్శనమివ్వనున్నాడని… అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ క్యారెక్టర్ ఇదని టాక్. మరి… ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా… ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=FMwGC9-TIhQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: