మహేష్ బాబు కు సుక్కుతో సృజనాత్మక విభేదాలు

Mahesh Babu – Sukumar Movie Cancelled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Film With Sukumar Cancelled Mahesh Makes It Official,Mahesh Babu And Sukumar Movie Latest News,Superstar Mahesh Babu And Sukumar Movie Cancelled
Mahesh Babu - Sukumar Movie Cancelled

ఈరోజు మధ్యాహ్నం వరకు అంతా సవ్యంగానే ఉంది. ప్రస్తుతం ‘మహర్షి’ చిత్ర నిర్మాణం చివరి దశలో ఉన్న తరుణంలో మహేష్ బాబు తదుపరి చిత్రాలు సీనియర్ డైరెక్టర్ సుకుమార్ తోను, రైసింగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితోను ఉంటాయనే వార్త ప్రచారంలో ఉంది. నిన్న కూడా సుకుమార్ చెప్పిన కథ ఫైనల్ వెర్షన్ మహేష్ బాబు విన్నారని, బాగుంది.. ఓకే అనుకున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ కొద్దిసేపటి క్రితం మహేష్ బాబు పెట్టిన ఒక ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది.
” క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సుకుమార్ దర్శకత్వంలో నేను చేయబోయే సినిమా జరగదు. సుకుమార్ నెక్స్ట్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.
“1- నేనొక్కడినే” వంటి cult classic ను నేనెప్పుడూ గుర్తుపెట్టుకుంటాను”.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదీ మహేష్ బాబు కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ అకౌంట్ లో చేసిన పోస్టింగ్. ఈ పోస్టింగ్ టాలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అయితే సుకుమార్ తదుపరి చిత్రం మహేష్ బాబుతోనే అనుకుంటున్న తరుణంలో ఈరోజు మధ్యాహ్నం మైత్రి మూవీ మేకర్స్ నుండి అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ కావటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

సినిమా సినిమాకు మధ్య సంవత్సరం పైనే గ్యాప్ తీసుకునే సుకుమార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో వెంటవెంటనే రెండు సినిమాలు చేయటం ఏమిటి అని ఆశ్చర్యపోయాయి టాలీవుడ్ వర్గాలు.
కానీ ఇంతలోనే మహేష్ బాబు నుండి ఈ ట్వీట్ రావటంతో ఇది ఈరోజు మధ్యాహ్నం మైత్రి మూవీ మేకర్స్ నుండి వచ్చిన అనౌన్స్మెంట్ ప్రభావమే అని అర్థం అవుతుంది.
కొత్త ప్రాజెక్టుల గురించి, కొత్త విశేషాల గురించి తప్ప ఒక సినిమా డ్రాప్ అవటం గురించి మహేష్ బాబు స్థాయి స్టార్ హీరో నుండి ఇలాంటి బహిరంగ ప్రకటన రావడం చాలా అరుదు.
అయితే కారణం ఏమైనప్పటికీ మహేష్ బాబు ఈ సినిమా ఉండదు అని చేసిన ట్వీట్ చాలా హుందాగా ఉంది.
మహేష్ బాబు విష్ చేసినట్లుగానే దర్శకుడు సుకుమార్ తదుపరి చిత్రం విజయవంతం కావాలని ఆశిద్దాం.
కాగా ఇప్పుడు “మహర్షి”పూర్తయిన వెంటనే మహేష్ బాబు అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమాను ఫాస్టప్ చేస్తారన్నది టాలీవుడ్ టాక్.

[subscribe]

[youtube_video videoid=DdYyQ6XGXYo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =