మాస్ మహరాజా రవితేజ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రం `విక్రమార్కుడు`. విక్రమ్ సింగ్ రాథోడ్, అత్తిలి సత్తిబాబు… ఇలా రెండు విభిన్న పాత్రల్లో ఆయన దర్శనమిచ్చాడు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్… అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలచింది. అంతేకాదు… తమిళ, హిందీ, కన్నడ, బెంగాలి, ఉర్దూ భాషల్లోనూ రీమేక్ అయి ఆదరణ పొందింది. అలాంటి `విక్రమార్కుడు`కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జరుగుతోందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్‌లో మాసివ్ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`ని తెరకెక్కిస్తున్న రాజమౌళి… తన తదుపరి చిత్రంగా `విక్రమార్కుడు` సీక్వెల్ చేసే దిశగా ప్లాన్ చేస్తున్నాడని ఇన్ సైడ్ సోర్స్ టాక్. అంతేకాదు.. తెలుగు, హిందీ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలిసింది. తెలుగులో రవితేజతోనూ, హిందీలో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడితోనూ ఈ సీక్వెల్ ఉంటుందని సమాచారం. త్వరలోనే ఈ సీక్వెల్‌పై మరింత సమాచారం వచ్చే అవకాశం లేకపోలేదు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: