తెలుగు రాష్ట్రాల్లో యంగ్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ స్థాయిలో కాకపోయినా… తమిళనాడులోనూ ఈ యంగ్ సెన్సేషన్‌కి మంచి క్రేజ్ ఉంది. `గీత గోవిందం`కి అక్కడ దక్కిన ఆదరణ చూస్తే… ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `నోటా` తరువాత విజయ్ మరో బైలింగ్వల్ మూవీ చేయబోతున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని టేకప్ చేయనున్నాడని కోలీవుడ్ టాక్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా నటించబోతోందట. అయితే… హీరోయిన్‌గా లేదంటే కీలక పాత్రలోనా? అన్న విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
కాగా… విజయ్ తాజా చిత్రం `డియర్ కామ్రేడ్` మే 22న రిలీజ్ కానుండగా…. క్రాంతిమాధవ్ కాంబినేషన్ మూవీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=1ZLTAIfJzvc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: