ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నందిత శ్వేత ప్రస్తుతం ప్రేమ కథా చిత్రమ్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ హారర్ గా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రమ్ కు సీక్వెల్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. దానితో పాటు నందిత అక్షర్ అనే మరో థ్రిల్లర్ మూవీలో కూడా నటిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజా అప్ డేట్ ఏంటంటే.. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని.. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తోన్నఈ మూవీ సెకండ్ షెడ్యూల్ లో నందితతో పాటు కీలక పాత్రల్లో షకలక శంకర్, సత్య, మధునందన్ పాల్గొంటున్నారు. వీరి పాత్రలు సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నాయట. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో పూర్తి చేసి మే నెలలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కాగా హాల్ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ లు కలిసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చిన్ని కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కంటెంట్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ తో ప్రతి ఒక్కరినీ అలరిస్తూ ఆలోచింపచేసేలా ఈ చిత్రాన్ని చిన్నికృష్ణ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో నందిత శ్వేతన్ కాలేజ్ లెక్చరర్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమాకు కెమెరామాన్: నగేష్ బెనెల్, మ్యూజిక్ డైరెక్టర్ : సురేష్ బొబ్బిలి, ఎడిటర్: జి.సత్య, ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి, కాస్య్టూమ్ డిజైనర్ : గౌరీనాయుడు, లైన్ ప్రొడ్యూసర్స్: గంగాధర్, రాజు ఓలేటి, పి.ఆర్. ఓ: జియస్ కె మీడియా, సి.ఎఫ్. ఓ: “యస్ మీడియా” సుమంత్.కో, ప్రొడ్యూసర్: కె.శ్రీనివాస రెడ్డి, నిర్మాణ సంస్థ: సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాతలు: సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ, రచన, దర్శకత్వం: బి. చిన్నికృష్ణ.
[youtube_video videoid=sPPimitdoAg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: