మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిన చిత్రం `రంగస్థలం`. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ పిరియాడిక్ డ్రామా… తెలుగునాట సంచలన విజయం సాధించింది. అలాగే పలు రికార్డులకు కేంద్ర బిందువుగా నిలిచింది. అలాంటి `రంగస్థలం`… ఇతర దక్షిణాది భాషల్లోనూ డబ్బింగ్ రూపంలో ఆ యా చోట్ల తెరపైకి రానుంది. తమిళ, మలయాళ వెర్షన్స్‌తో పాటు కన్నడ భాషలోనూ ఈ సినిమా అనువాదం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… కొన్ని దశాబ్దాలుగా అనువాద చిత్రాలను అనుమతించని కన్నడ ఇండస్ట్రీ… చాలా కాలం తరువాత నిబంధనలను సడలించి ఇప్పుడిప్పుడే డబ్బింగ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇందులో భాగంగా… తెలుగు నుంచి దశాబ్దాల కాలం తరువాత `రంగస్థలం` చిత్రం కన్నడ సీమ థియేటర్లలో అనువాద రూపంలో ప్రదర్శితం కానుంది. మరి… తెలుగులో సంచలన విజయం సాధించిన `రంగస్థలం` అనువాదాల రూపంలోనూ విజయఢంకా మ్రోగిస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=kDjqkgnaTIk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: