కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 25

ట్రైలర్ & టీజర్

రఘుపతి వెంకయ్య నాయుడు మూవీ ట్రైలర్ రిలీజ్

మండవ శాంతిశ్రీ సమర్పణ లో యెల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై బాబ్జీ దర్శకత్వంలో నరేష్ హీరోగా ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రఘుపతి వెంకయ్య నాయుడు మూవీనవంబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. తనికెళ్ళ భరణి, మహర్షి, సత్య ప్రియ, భావన ముఖ్య పాత్రలలో నటించారు, శ్రీ వెంకట్ సంగీతం అందించారు. రఘుపతి వెంకయ్య నాయుడు తెలుగు చలన చిత్ర సీమకు ఎనలేని సేవలు అందించారు. మద్రాస్ (చెన్నై ) లో మొట్ట మొదటి థియేటర్ ను నిర్మించిన ఘనత ఆయనదే.

Team TFNవాట్సాప్
త్వరలో రాబోతున్న 'రూలర్' టీజర్
ట్రైలర్ & టీజర్

త్వరలో రాబోతున్న 'రూలర్' టీజర్

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో ఓ పాట తెర‌కెక్కిస్తున్నారు. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మ‌రోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఏ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
అట్లీతో వరుసగా మూడు సినిమాలు సూపర్ స్టార్ డీల్...!
సినిమా వార్తలు

అట్లీతో వరుసగా మూడు సినిమాలు సూపర్ స్టార్ డీల్...!

తమిళ్ లో పలు సూపర్ హిట్ సినిమాలు తీసి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు అట్లీ. ఇక ఇటీవలే విజయ్ తో బిగిల్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు అట్లీ. ఇక అట్లీ డైరక్షన్ లో షారుఖ్ ఖాన్ తో ఒక సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక అట్లీ దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన 'రాజా రాణి' సినిమాను షారుఖ్ రీమేక్ చేయనున్నాడు. ఇక ఈ రీమేక్ కు అట్లీ నే దర్శకత్వం వహించనున్నాడు. మరో కొద్దిరోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అల .. వైకుంఠపురములో .. పై ఫ్రాన్స్ కన్సొలేట్ ట్వీట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీఅల .. వైకుంఠపురములో .. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. టబు, సుశాంత్ , నవదీప్, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ కు ప్రేక్షకులనుండి అద్భుత రెస్పాన్స్ లభించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'విరాటపర్వం'కోసం బాలీవుడ్ యాక్షన్ డైరక్టర్

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమెకు శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అశోక్ గల్లా మూవీ లాంచ్ కు ముఖ్య అతిథి రామ్ చరణ్ ?

అమర్ రాజా మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిడిపి MP జయదేవ్ గల్లా తనయుడు, సూపర్ స్టార్ మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ 10 వ తేదీ ప్రారంభం కానుంది. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయిక గా ఎంపికయ్యారు. నరేష్, సత్య, అర్చనా సౌందర్య ముఖ్య పాత్రలలో నటించనున్నారు. జిబ్రాన్ సంగీతం అందించనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘ఒకే ఒక్కడు’కు 20 ఏళ్ళు

భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు శంక‌ర్ తీరే వేరు. ముఖ్యంగా... సామాజిక అంశాలకు సాంకేతిక విలువ‌లను జోడించి ఆయ‌న రూపొందించిన ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట సంచ‌ల‌నం సృష్టించాయి. వాటిలో `ఒకే ఒక్క‌డు` (త‌మిళంలో `ముద‌ల్ వ‌న్‌`) ఒక‌టి. `ఒక రోజు ముఖ్య‌మంత్రి` అనే కొత్త త‌ర‌హా పాయింట్‌తో, ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా రూపొందించిన ఈ సెన్సేష‌న‌ల్ మూవీ... తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించింది. త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు, `యాక్షన్ కింగ్` అర్జున్ తో శంక‌ర్ రూపొందించిన రెండో సినిమా ఇది. ఇందులో టీవీ జ‌ర్న‌లిస్ట్ గా, ముఖ్య‌మంత్రిగా రెండు విభిన్న ఛాయ‌లున్న పాత్ర‌లో అర్జున్ ఒదిగిపోయాడు…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాల‌కృష్ణ‌కు జోడీగా ర‌చితా రామ్‌?

నటసింహ నందమూరి బాలకృష్ణకు అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో బోయపాటి శ్రీను ఒక‌రు. జట్టుక‌ట్టిన రెండు సార్లూ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లుకొట్టిన ఘ‌న‌త ఈ కాంబినేష‌న్‌ది. `సింహా`, `లెజెండ్‌` రూపంలో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ ద్వ‌యం... హ్యాట్రిక్ మూవీకి సిద్ధ‌మ‌వుతోంది. గ‌త రెండు చిత్రాల్లోనూ బాల‌య్య‌ని రెండు విభిన్న పాత్ర‌ల్లో (ద్విపాత్రాభిన‌యం) చూపించిన బోయ‌పాటి... థ‌ర్డ్ జాయింట్ వెంచ‌ర్‌లో మాత్రం అందుకు భిన్నంగా రెండు షేడ్స్ ఉన్న‌ పాత్రలో ప్రెజెంట్ చేయ‌బోతున్నాడ‌ని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సల్మాన్ ఖాన్‌కి విల‌న్‌గా ‘ప్రేమిస్తే’ భరత్

`బాయ్స్‌`, `ప్రేమిస్తే` వంటి త‌మిళ అనువాద చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన క‌థానాయ‌కుడు భ‌ర‌త్‌. `యువ‌సేన‌`, `స్పైడ‌ర్‌` వంటి తెలుగు సినిమాల్లోనూ సంద‌డి చేసిన ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్‌... ఆ మ‌ధ్య ‘జాక్‌పాట్’(2013) అనే హిందీ చిత్రంలోనూ మెరిశాడు. క‌ట్ చేస్తే... ఆరేళ్ళ త‌రువాత బాలీవుడ్‌లో మ‌రో సినిమాలో న‌టించ‌బోతున్నాడు భ‌ర‌త్‌. అయితే, ఈ సారి ఏకంగా బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కు విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు భ‌ర‌త్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హాలీవుడ్ మూవీ ఐకానిక్ పాత్రకు ప్రియదర్శి డబ్బింగ్

ఇప్పటీకే హాలీవుడ్ యానిమేటెడ్ మూవీస్ కు తెలుగు డబ్బింగ్ లో మన వాళ్ళు పలు పాత్రలకు తమ గొంతులను అరువు ఇచ్చిన సందర్భాలు వున్నాయి. నిన్ననే ఫ్రోజెన్ 2 సినిమాలో కీలకపాత్ర ఐన 'ఎల్సా' అనే పాత్రకు డబ్బింగ్ చెబుతున్నట్టు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్ లో ప్రియదర్శి కూడా చేరిపోయాడు. ఈ సినిమాలో ఐకానిక్ పాత్ర ఐన ఫన్నీ స్నో మ్యాన్ ఒలఫ్ పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నాడు. మరి ప్రియదర్శికి ఈ ఆఫర్ రావడం కష్టమే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అప్పటి వరకూ నటిస్తూనే ఉంటా..!

తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలపై ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తునే ఉంటుంది. ఎప్పటిలాగే ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి వినిపిస్తుంది. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తోన్న వార్తల నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. తన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ మాట్లాడుతూ... తనకు కొందరు బీజేపీ రంగు వేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్ విషయంలో కూడా భాజాపా ఇలానే చేసిందని, కానీ అది సాధ్యంకాలేదని, తాను కూడా వారి ట్రాప్లో పడనని అన్నారు. దీంతో ఇన్నాళ్ళుగా భాజాపాతో రజనీ కలుస్తారనే వార్తలకు చెక్ పడింది…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డైరెక్టర్ కావలెను - యంగ్ డైరెక్టర్స్ కు 'అసురన్' స్పెషల్ స్క్రీనింగ్

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన 'అసురన్' మూవీని తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక వెంకటేష్ పక్కన శ్రేయ శరణ్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Pappu Lanti Abbayi Song Teaser From Kamma Rajyamlo Kadapa Reddlu Out Now,Kamma Rajyam Lo Kadapa Reddlu Full Songs, Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Songs, Kamma Rajyam Lo Kadapa Reddlu Telugu Movie Songs, latest telugu movies news, Pappu Laanti Ab
ట్రైలర్ & టీజర్

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' - 'పప్పు లాంటి అబ్బాయి' సాంగ్ టీజర్ రిలీజ్

టైటిల్ తోనే తన సినిమాలకు ఎక్కడా లేని క్రేజ్ ను తీసుకొచ్చే వర్మ.. ఈసారి ఏకంగా రెండు వర్గాల పేర్లనే టైటిల్ గా తీసుకొని 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అన్న సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వర్మ ప్రమోషన్స్ ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టీజర్, ట్రైలర్, పాటలతోనే సగం సినిమాకు క్రేజ్ తీసుకొస్తాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేసి... డైరెక్ట్ గా పలు రాజకీయ నేతలపైనే సెటైర్లు వేసాడు. ఇప్పుడు తాజాగా మరో పాటతో రెడీ అయ్యాడు. తాజాగా ఈ సినిమా నుండి 'పప్పు లాంటి అబ్బాయి' సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసి షాకిచ్చాడు. మరి ఈ పాట ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూద్దాం..

TFN Adminవాట్సాప్
Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Thipparaa Meesam Movie Plus Points, Thipparaa Meesam Movie Public Talk, Thipparaa Meesam Movie Rating, Thipparaa Meesam Movie Review, Thipparaa Meesam Mo
రివ్యూ

ఎంత తిప్పినా తిరగని మీసం

మొత్తానికి సింపతీకి అవకాశం లేని పాత్ర ద్వారా హీరో శ్రీ విష్ణు- దర్శకుడు కృష్ణ విజయ్ లకు ఏ స్థాయి సక్సెస్ దక్కుతుందో చూడాలి.

Team TFNవాట్సాప్
సాంగ్

'90ML' నుండి 'నాతో నువ్వుంటే చాలు' లిరికల్ వీడియో రిలీజ్

శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా '90ML' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకుంది. గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన దేవదాస్‌ డ్రింకర్‌ గా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రాశీ ఖన్నా న్యూ ట్యాలెంట్

తెలుగు, తమిళ భాషాచిత్రాలతో బిజీగా ఉన్న పంజాబీ బ్యూటీ రాశీ ఖన్నా తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టు కుంటున్నారు. సూపర్ హిట్ మూవీ ఊహలు గుస గుస లాడే తో టాలీవుడ్ కు ఎంటరయిన రాశీ ఖన్నా నటించిన బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, తొలి ప్రేమ మూవీస్ ఘనవిజయం సాధించాయి. సక్సెస్ ఫుల్ ఇమైక్క నోడిగళ్ మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించిన రాశీ ఖన్నా కోలీవుడ్ లో బిజీగా మారారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'కల్కి' అవుట్ - 'శివగామి' ఇన్

అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా 'రొమాంటిక్' మూవీ రూపొందుతున్న తెలిసిందే. స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్ పూరి అందించిన ఈ సినిమా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో ఇషా కొప్పికర్

నటి, మోడల్, పొలిటీషియన్ ఇషా కొప్పికర్ 1998 సంవత్సరంలో చంద్రలేఖ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ భాషా చిత్రాలలో నటించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ హిందీ మూవీ కంపెనీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. వాలంటరీ గా నటనకు బ్రేక్ తీసుకొని, వివాహం చేసుకొని తల్లిగా మారిన ఇషా కొప్పికర్ మరొకసారి RGV వెబ్ సిరీస్ ద్వారా లైమ్ లైట్ లోకి వస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'గోవిందా హరి గోవిందా' అంటున్న చిరు-కొరటాల..!

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కొరటాల కాంబినేషన్ లో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జ‌రుపుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హాలీవుడ్ మూవీ "ది వారియర్ క్వీన్ ఆఫ్ ఝాన్సీ "

వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో రూపొందిన మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత కథ తో ఒక హాలీవుడ్ మూవీ రూపొందింది. ఒక భారతీయ మహిళ ప్రధాన పాత్రతో రూపొందిన మొట్టమొదటి హాలీవుడ్ మూవీ"ది వారియర్ క్వీన్ ఆఫ్ ఝాన్సీ ".

Team TFNవాట్సాప్

షేర్