డైరెక్టర్ కావలెను – యంగ్ డైరెక్టర్స్ కు ‘అసురన్’ స్పెషల్ స్క్రీనింగ్

Asuran Special Screening for Young Directors,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Asuran Special Screening,Asuran Movie Special Screening for Tollywood Directors,Asuran Movie Updates

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన ‘అసురన్’ మూవీని తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక వెంకటేష్ పక్కన శ్రేయ శరణ్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా సినిమా తెస్తున్నట్టు ప్రకటించేసారు కానీ డైరెక్టర్ ఎంపిక విషయంలో కాస్త ఆలోచిస్తున్నట్టే వున్నారు సురేష్ బాబు. ‘రాజుగారి గది 3’ దర్శకుడు ఓంకార్ కి ‘అసురన్’ తెలుగు రీమేక్ బాధ్యతలను అప్పగిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై క్లారిటీ రాలేదు. మరో పక్క ఈ సినిమాను అదే రేంజ్ లో తీయగలిగే డైరెక్టర్ కోసం చూస్తున్నారట. సినిమా చూసి యాజిటీజ్ గా రీమేక్ చెయ్యగలమని ఎవరు ముందుకు వస్తే వారికి బాధ్యత అప్పగించాలని ప్లాన్ చేసారట. ఈ నేఫధ్యంలో రీసెంట్ గా రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో ఒక 20 మంది యువ దర్శకులకి షో వేశారట. ఇక సినిమా చూసిన కొంతమందికి రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదట.. కొంత మందికి తమ కెపాసిటీ మీద డౌట్ తో.. ఆ రేంజ్ లో తీసే క్యాపబిలిటీ లేక వెనుకడుగు వేసారట. మరికొంత మంది నిర్ణయం తెలియాల్సి వుంది. మరి చూద్దాం ఎవరు ముందుకు వస్తారో..!

కాగా అసురన్ తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − nine =