తమిళ్ లో పలు సూపర్ హిట్ సినిమాలు తీసి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు అట్లీ. ఇక ఇటీవలే విజయ్ తో బిగిల్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు అట్లీ. ఇక అట్లీ డైరక్షన్ లో షారుఖ్ ఖాన్ తో ఒక సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక అట్లీ దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన ‘రాజా రాణి’ సినిమాను షారుఖ్ రీమేక్ చేయనున్నాడు. ఇక ఈ రీమేక్ కు అట్లీ నే దర్శకత్వం వహించనున్నాడు. మరో కొద్దిరోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే.. ఒక్క సినిమాను కాదు ఏకంగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడంట. తన ప్రొడక్షన్ హౌస్ లోనే వరుసగా మూడు సినిమాలు తీసేలా డీల్ కుదుర్చుకున్నాడట షారుఖ్. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక గత కొంత కాలంగా సరైన హిట్ పడలేదు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ కు. మరి ఈ రీమేక్ తో అయినా షారుఖ్ ఖాన్ హిట్ ఖాతా మళ్ళీ తెరుస్తాడేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: