భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ తీరే వేరు. ముఖ్యంగా… సామాజిక అంశాలకు సాంకేతిక విలువలను జోడించి ఆయన రూపొందించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించాయి. వాటిలో `ఒకే ఒక్కడు` (తమిళంలో `ముదల్ వన్`) ఒకటి. `ఒక రోజు ముఖ్యమంత్రి` అనే కొత్త తరహా పాయింట్‌తో, ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించిన ఈ సెన్సేషనల్ మూవీ… తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించింది. తన తొలి చిత్ర కథానాయకుడు, `యాక్షన్ కింగ్` అర్జున్ తో శంకర్ రూపొందించిన రెండో సినిమా ఇది. ఇందులో టీవీ జర్నలిస్ట్ గా, ముఖ్యమంత్రిగా రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో అర్జున్ ఒదిగిపోయాడు. మనీషా కోయిరాలా కథానాయికగా నటించిన ఈ సినిమాలో లైలా, రఘువరన్, మణివన్నన్, వడివేలు, విజయకుమార్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`డబుల్ ఆస్కార్ అవార్డు గ్రహీత` ఎ.ఆర్.రెహమాన్ స్వరసారథ్యంలో రూపొందిన గీతాలన్నీ విశేషాదరణ పొందాయి. “నెల్లూరి నెరజాణ”, “మగధీర”, “ఉట్టి మీద కూడు”, “అందాల రాక్షసివే”, “ఏరువాక సాగుతుండగా”, “షకలక బేబీ”… ఇలా ప్రతీ పాట అప్పట్లో సంచలనమే. తమిళనాట పలు పురస్కారాలను కైవసం చేసుకున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌ను… శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఎ.ఎమ్.రత్నం నిర్మించారు. 1999లో దీపావళి కానుకగా నవంబర్ 9న (తమిళంలో నవంబర్ 7న) విడుదలై అనూహ్య విజయం సాధించిన ‘ఒకే ఒక్కడు’… నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: