’90ML’ నుండి ‘నాతో నువ్వుంటే చాలు’ లిరికల్ వీడియో రిలీజ్

శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ’90ML’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకుంది. గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన దేవదాస్‌ డ్రింకర్‌ గా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ‘నాతో నువ్వుంటే చాలు…కోరుకొను ఇంకేం వరాలు’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. చంద్రబోస్ రాసిన ఈ పాటను ప్రముఖ గాయకుడు అద్నాన్ సామి ఆలపించాడు.

కాగా ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తుండగా రవి కిషన్‌, రావూ రమేష్‌, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాకు కూడా ‘ఆర్ ఎక్స్100’ సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అన్ని పనులు త్వరలో పూర్తి చేసి క్రిస్మస్ పండుగ సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + fourteen =