సల్మాన్ ఖాన్‌కి విల‌న్‌గా ‘ప్రేమిస్తే’ భరత్

Bharath Plays Villain In Salman Khan Movie,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Bharath play villain in Salman Khan Radhe,Salman Khan Movie Radhe,Bharath Plays Villain Role in Prabhu Deva Next Movie,Salman Khan New Movie Radhe

`బాయ్స్‌`, `ప్రేమిస్తే` వంటి త‌మిళ అనువాద చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన క‌థానాయ‌కుడు భ‌ర‌త్‌. `యువ‌సేన‌`, `స్పైడ‌ర్‌` వంటి తెలుగు సినిమాల్లోనూ సంద‌డి చేసిన ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్‌… ఆ మ‌ధ్య ‘జాక్‌పాట్’(2013) అనే హిందీ చిత్రంలోనూ మెరిశాడు. క‌ట్ చేస్తే… ఆరేళ్ళ త‌రువాత బాలీవుడ్‌లో మ‌రో సినిమాలో న‌టించ‌బోతున్నాడు భ‌ర‌త్‌. అయితే, ఈ సారి ఏకంగా బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కు విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు భ‌ర‌త్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… సల్మాన్ ఖాన్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రభుదేవా కాంబినేషన్‌లో ‘రాధే’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. “యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్” అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో భరత్ ప్రతినాయకుడిగా నటించనున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసిన భరత్… సల్మాన్ పక్కన నటించాలనే తన కల నిజమైందని… ఈ అవకాశం ఇచ్చిన ప్రభుదేవాకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నాడు.

మరి… సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడ‌ర్‌’లో విలన్‌కి తమ్ముడిగా అల‌రించిన‌ భరత్… ఇప్పుడు పూర్తి తరహా ప్రతినాయకుడిగా ప్రేక్షకులను ఏ మేరకు రంజింప‌జేస్తాడో చూడాలి. 2020 ఈద్‌కి `రాధే` ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − two =