కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘రూలర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం కేరళలో ఓ పాట తెరకెక్కిస్తున్నారు. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఏ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా ఓ వార్త వినిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. వచ్చే వారంలో `రూలర్` టీజర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఈ టీజర్లో బాలయ్య రెండు పాత్రల్నీ పూర్తిగా రివీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తుండగా… కీలక పాత్రల్లో భూమికా చావ్లా, జయసుధ, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ ఏడాది చివరలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్రయూనిట్.
మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `జై సింహా` మంచి హిట్ కొట్టింది.. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొడతారేమో చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: