ఎంత తిప్పినా తిరగని మీసం

Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Thipparaa Meesam Movie Plus Points, Thipparaa Meesam Movie Public Talk, Thipparaa Meesam Movie Rating, Thipparaa Meesam Movie Review, Thipparaa Meesam Movie Story, Thipparaa Meesam Review, Thipparaa Meesam Telugu Movie Live Updates, Thipparaa Meesam Telugu Movie Review, Thipparaa Meesam Telugu Movie Review And Rating, Tollywood Cinema Updates

అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీది నాది ఒకటే కథ వంటి చిత్రాలలో లీడ్ రోల్స్ తో పాటు మరికొన్ని చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన “తిప్పరా మీసం” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృష్ణ విజయ్ దర్శకత్వంలో నిర్మితమై మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథాoశం:

మణిశంకర్( శ్రీ విష్ణు) ఒక పబ్ లో డీజే. అతనిదొక విచ్చలవిడి జీవితం.మందు,డ్రగ్స్,సిగరెట్లు, బెట్టింగులు,గొడవలు అతని నిత్యకృత్యాలు. వీటికి తోడు మాతృ ద్వేషం అదనపు క్వాలిఫికేషన్. అంటే తన తల్లి (రోహిణి) మీద చిన్నప్పటినుండి పెంచుకున్న ద్వేషం అతనితోపాటు పెరిగింది.ఆ ద్వేషం ఏ స్థాయికి వెళుతుంది అంటే కన్నతల్లి మీదనే  cheque bounce case వేసి కోర్టుకు ఈడ్చే స్థాయి ద్వేషం అది. క్రికెట్ బెట్టింగ్ లో ఒక రౌడీ వాడికి బాకీ  పడి ఆ అప్పు తీర్చడం కోసం తల్లి మీదనే కేసు వేసి ఆమె పరువు బజారు కీడ్చిన ఘనుడు మన హీరో.
డీజే గా చేస్తూ యథేచ్ఛగా   మందు, దమ్ములు కొడుతూ జులాయి తనానికి బ్రాండ్ అంబాసిడర్ గా తిరిగే మణి  మౌనిక (నిక్కీ తంబోలి) అనే అమ్మాయికి తొలి పరిచయంలోనే ప్రపోజ్ చేస్తాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కు సెలెక్ట్ అయి ఉన్న మౌనిక అతని ప్రపోజల్ను వెంటనే యాక్సెప్ట్ చేస్తుంది. అయితే డబ్బు కోసం కన్న తల్లి మీద కేసు వేసిన వ్యక్తి ఇతనే అని తెలిసి మౌనిక ఇతనికి దూరంగా ఉంటుంది. ఆ తర్వాత జరిగే కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా ఒక హత్యా నేరాన్ని తనమీద వేసుకుని ఐదు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి వస్తాడు మణి.

ఇంతకూ మణి జైలుకు వెళ్లిన కారణం ఏమిటి ? కారకులు ఎవరు? అతని తల్లిని అంతగా ద్వేషించడానికి కారణం ఏమిటి? తను ప్రేమించిన మౌనిక ప్రేమ అతనికి దక్కిందా? ఇంతకు మణి మీసం తిప్పి  సవాలు విసిరింది ఎవరికి?
ఇత్యాది ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది ‘తిప్పరా మీసం’ క్లైమాక్స్.

డైరెక్షన్ ఎలా ఉంది ?

హీరోను ఎంత రౌడీగా, జులాయిగా, సకల సర్వ వ్యసన సమన్వితుడిగా చూపిస్తే అంత గ్లామరు, అంత క్రేజ్ ఏర్పడతాయని నమ్మే దిక్కుమాలిన కల్ట్ ఫార్ములా ఒకటి ఈమధ్య ఎక్కువైంది.  దురదృష్టవశాత్తు ఆ ఫార్ములాలో ఒకటి రెండు సినిమాలు
హిట్టవడంతో ఇలాంటి క్యారెక్టర్ లెస్ క్యారెక్టర్లను క్రియేట్ చేయటం ఒక ట్రెండ్ గా మారింది. ‘ తిప్పరా మీసం’లో హీరో క్యారెక్టర్ ను ఈ ట్రెండ్ కు పరాకాష్టగా డిజైన్ చేశాడు దర్శకుడు కృష్ణ విజయ్. తల్లి మీద అతని ద్వేషానికి గల కారణం పట్ల ప్రేక్షకుల్లో కూడా సానుభూతి ఏర్పడితే ఆ క్యారెక్టర్ ను రిసీవ్ చేసుకోవడానికి ప్రేక్షకుడు వెనుకాడడు.

కానీ ఇందులో ఆ కారణం కొంతవరకు బలమైనదే అయినా మిగిలిన విషయాలలో హీరో ఆటిట్యూడ్ పట్ల ప్రేక్షకుడికి చిరాకు, కోపం తప్ప సానుభూతి ఏర్పడే అవకాశమే లేదు. ఒక చెత్త వెధవను ఒక కాబోయే పోలీస్ ఎలా ప్రేమించింది .. పక్కనున్న ఫ్రెండ్స్ ఎలా ప్రేమిస్తారు.. క్యారెక్టర్ కు ఒక క్యారెక్టర్ ఉండనవసరం లేదా ? సానుభూతి పాత్రం కాని హీరోయిజం,  త్యాగం, ప్రేమ, ద్వేషం ఇవన్నీ నిరుపయోగమే. ఈ విధంగా ఫస్ట్ ఫ్రేమ్ నుండి క్లైమాక్స్ దాకా హీరో క్యారెక్టర్ పట్ల  తెరమీద సహా  పాత్రలకు గానీ, తెర ముందు ఉన్న ప్రేక్షకులకు గాని సానుభూతి ఏర్పడకపోగా “వీడు పెద్ద చెత్త వెధవలా ఉన్నాడే” అనే చిరాకు, అసహనం పుట్టించ్చాయి.so… there ends the matter.

ప్రస్టేటెడ్ క్యారెక్టర్స్ ను తెరమీద ఆవిష్కరిస్తున్నప్పుడు ఆ ఫ్రస్టేషన్ కు గల కారణాల పట్ల, ఆ పాత్ర బిహేవియర్ పట్ల ప్రేక్షకుల్లో ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడాలి. అంతేగాని.. గడ్డాలు మీసాలు పెంచుకొని , డీప్ లుక్స్ తో, సీరియస్ ఆటిట్యూడ్ తో  అడ్డమైన వెధవ పనులు చేస్తే సింపతీ పుట్టక పోగా చిరాకు నషాలానికి ఎక్కుతుంది. సో… హీరో క్యారెక్టర్ ను  ఇలా సానుభూతి రహితంగా డిజైన్  చేసుకోవడమే ఈ సినిమాలో దర్శకుడు చేసిన అతిపెద్ద తప్పిదం. ఇక టెక్నికల్ గా టేకింగ్, షాట్  కంపోజింగ్ , ఎగ్జిక్యూషన్ వంటి విషయాలలో దర్శకుడు కృష్ణ విజయ్ మంచి పరిణితి చూపించాడు. నిజానికి హీరో క్యారెక్టర్ ను ఇంత రఫ్ అండ్ టఫ్ గా కాకుండా శ్రీ విష్ణు గత చిత్రాల్లో ఉండే సాఫ్ట్ యాటిట్యూడ్ తో డీల్ చేసి ఉంటే it would have been different.

పర్ఫార్మెన్స్:

ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమా మొత్తం సర్వాంతర్యామిగా కనిపించింది శ్రీ విష్ణు. డైరెక్టర్ డిజైన్ చేసిన మేరకు మణి శంకర్ పాత్రలో ఒదిగిపోయాడు శ్రీ విష్ణు. బేసికల్ గా చాలా మంచి పర్ఫార్మర్ కావటంతో శ్రీ విష్ణు లుక్ అండ్ ఫీల్ పట్ల ప్రేక్షకుల్లో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆ సాఫ్ట్ ఇమేజ్ వల్లే శ్రీ విష్ణు సినిమాలకు ఒక సేపరేట్ వ్యూవర్షిప్ ఉంది. ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడం ఆర్టిస్ట్ కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని బాగానే నెరవేర్చాడు శ్రీ విష్ణు. కానీ పాత్ర సానుభూతి పాత్రమైనది కానప్పుడు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా  చేయగలిగిందేమీ లేదు.

ఇక మిగిలిన పాత్రల విషయంలో చెప్పుకోదగింది… గుర్తుండిపోయేది తల్లి పాత్ర పోషించిన సీనియర్ నటీమణి రోహిణి నటన. కొడుకు చేష్టలకు తన మనసు ఎంత గాయపడినా తన నిస్సహాయతను మనసులోనే దాచుకుని ప్రేమను వ్యక్తం చేసే తల్లి పాత్రలో రోహిణి నటన సింప్లీ సూపర్బ్. ఇక హీరోయిన్ తో సహా మిగిలిన పాత్రలు ఏవీ చెప్పుకోదగినవి కావు.

ఇక మేకింగ్ అండ్ టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే ఈ కథకు,ఈ సినిమాకు అవసరమైన మేరకు మిగిలిన అంశాలన్నీ up to the mark అన్నట్లుగా ఉన్నాయి.

మొత్తానికి సింపతీకి అవకాశం లేని పాత్ర ద్వారా హీరో శ్రీ విష్ణు- దర్శకుడు కృష్ణ విజయ్ లకు ఏ స్థాయి సక్సెస్ దక్కుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here