సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కొరటాల కాంబినేషన్ లో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఏదైనా కొత్త సినిమా మొదలవుతుందంటే ఆ సినిమాపై పలు వార్తలు రావడం కామనే. ఇక చిరంజీవి లాంటి హీరో సినిమా అయితే ఆ రూమర్లు కాస్త ఎక్కువే ఉంటాయి కదా. ఇప్పటికే ఎన్నో రూమర్లు రాగా ఇప్పుడు సినిమా టైటిల్ పై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి ‘గోవింద ఆచార్య’ టైటిల్ అనుకుంటున్నట్టు వార్తలు రాగా.. ఇప్పుడు మరో టైటిల్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ‘గోవిందా హరి గోవిందా’… వాటికి సంబంధించిన ప్రాపర్టీస, వాటిని దొంగిలించే ముఠా ఈ నేపధ్యంలో సినిమా సాగుతుందని సమాచారాం. కాబట్టి ఈ టైటిల్ అయితే కరెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నారట. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈ సినిమాలో ఇప్పటికే ఓ నాయికగా సీనియర్ హీరోయిన్ త్రిషను ఎంపికచేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరో హీరోయిన్ ను కూడా ఎంపిక చేసే పనిలో వున్నారు. నయనతార, కాజల్ లాంటి వారిని తీసుకోవాలని భావిస్తున్నారట. ఇక అజయ్ – అతుల్ సంగీతం అందిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటన్నింటిపై ఓ క్లారిటీ రావాలంటే చిత్రయూనిట్ యూనిట్ ప్రకటించేంత వరకు ఆగాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: