హాలీవుడ్ మూవీ “ది వారియర్ క్వీన్ ఆఫ్ ఝాన్సీ “

The Warrior Queen Of Jhansi, Epitomizes life Of Lakshmi Bhai,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,The Warrior Queen of Jhansi Story,Lakshmi Bhai History

వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో రూపొందిన మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత కథ తో ఒక హాలీవుడ్ మూవీ రూపొందింది. ఒక భారతీయ మహిళ ప్రధాన పాత్రతో రూపొందిన మొట్టమొదటి హాలీవుడ్ మూవీ”ది వారియర్ క్వీన్ ఆఫ్ ఝాన్సీ “.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారతీయ మూలాలున్న అమెరికన్ నటి దేవిక భిసే ప్రధాన పాత్రలో స్వాతి భిసే దర్శకత్వంలో “ది వారియర్ క్వీన్ ఆఫ్ ఝాన్సీ ” మూవీ ఇంగ్లీష్, మరాఠీ భాషలలో రూపొంది నవంబర్ 29 వతేదీ రిలీజ్ కానుంది. ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా నటించిన దేవిక మాట్లాడుతూ … భారతీయ వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయ్ ధైర్య సాహసాలను ప్రపంచ ప్రేక్షకులకు చాటి చెప్పేలా ఈ మూవీ రూపొందిందని, ఈ క్యారెక్టర్ కై గుర్రపు స్వారీ నేర్చుకున్నానని, ప్రముఖ కలరిపయట్టు గురువు గోపకుమార్ గురుక్కల్ వద్ద యుద్ధ విద్యలు నేర్చుకొన్నానని, మరాఠీ డైలాగ్స్ పలకడానికి మరాఠీ భాషను సాధన చేశానని చెప్పారు. ఒక భారతీయ మహిళ జీవిత చరిత్ర హాలీవుడ్ మూవీగా రూపొందడం భారతీయులకు గర్వకారణమే కదా.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.