నటి, మోడల్, పొలిటీషియన్ ఇషా కొప్పికర్ 1998 సంవత్సరంలో చంద్రలేఖ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ భాషా చిత్రాలలో నటించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ హిందీ మూవీ కంపెనీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. వాలంటరీ గా నటనకు బ్రేక్ తీసుకొని, వివాహం చేసుకొని తల్లిగా మారిన ఇషా కొప్పికర్ మరొకసారి RGV వెబ్ సిరీస్ ద్వారా లైమ్ లైట్ లోకి వస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇషా కొప్పికర్ మాట్లాడుతూ .. కంపెనీ మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించిన తరువాత చాలా మూవీస్ లో సాంగ్ ఆఫర్స్ వచ్చాయని, తాను అంగీకరించలేదని, RGV రూపొందిస్తున్న వెబ్ సిరీస్ లో కాప్ గా నటిస్తున్నానని, కన్నడ మూవీస్ లూటీ, కవచ లో కాప్ గా నటించానని, తన పేరు ఇషా కాప్ ఇక్కర్ గా మార్చుకొంటానని నవ్వుతూ చెప్పారు. సినీ ఫీల్డ్ లో చాల మార్పులు సంభవించాయని, ఇప్పుడు అందరూ
ప్రొఫెషనల్ గా ఉంటున్నారని, న్యూ జనరేషన్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని ఇషా చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























