‘విరాటపర్వం’కోసం బాలీవుడ్ యాక్షన్ డైరక్టర్

Bollywood Action Director for Virataparvam Movie,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Virataparvam Movie Updates,Virataparvam Telugu Movie Latest News,Rana New Film Virataparvam,Virataparvam Bollywood Director

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమెకు శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో నక్సల్స్ కు, పోలీస్ అధికారులకు మధ్య కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఆ సీన్స్ ఇంట్రస్టింగ్ గా తెరకెక్కేందుకు కాను.. బాలీవుడ్ యాక్షన్ డైరక్టర్ ని తీసుకుని వచ్చారని సమాచారాం. ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రానికి పనిచేసిన స్టీఫెన్ రిచ్చర్ ని ఈ సినిమాకోసం తీసుకొచ్చినట్టు తెలుస్తుంది.

కాగా ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ రావ్‌,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫిగా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =