
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 24

రవితేజ సినిమాలో స్టార్ డాటర్స్
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కార్తికేయ ‘90 ML’
బాలకృష్ణ చిత్రానికి అనిరుధ్ బాణీలు?
మహేష్, రాంచరణ్ బాటలో ఎన్టీఆర్..?

#IFFI 50 ట్రెండ్ సెట్టర్స్ గా మన నటీనటులు..

హిందీలో కూడా వస్తున్న #prabhas20

20వ వసంతంలోకి 'చిరునవ్వుతో'

'బొమ్మరిల్లు' భామకి బంపర్ ఆఫర్ ?
'జాన్' షూటింగ్ అప్ డేట్
సాలిడ్ గా 'నిశ్శబ్దం' ప్రీ రిలీజ్ బిజినెస్
'సరిలేరు నీకెవ్వరు' కేరళ షెడ్యూల్ పూర్తి
ఫ్రోజన్ 2 లో ఎల్సా పాత్రకు శృతి హాసన్ డబ్బింగ్

"విజయ్ సేతుపతి " మూవీ టీజర్ రిలీజ్

ఏడు చేపల కథ ఫస్ట్ డే కలెక్షన్స్

యూనిక్ పెయిర్ వరుణ్ తేజ్ సినిమా కోసం
వెండి తెరపై హీరో హీరోయిన్లకు ఫాదర్ క్యారెక్టర్ లో చేయాలంటే మనకు వెంటనే కొన్ని పేర్లు కళ్ళముందుకు వచ్చేస్తాయి. అందులో మొదట గుర్తొచ్చేది ప్రకాష్ రాజ్, ఆ తర్వాత రావు రమేష్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, నాజర్, జగపతిబాబు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పేర్లు తెరపైకి వస్తాయి. అయితే ఇప్పుడు వరుణ్ సినిమా కోసం ఓ యూనిక్ పెయిర్ జంటగా నటించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
ర్యాప్ సాంగ్ సింగర్ రానా దగ్గుబాటి
నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి ఇప్పుడు గాయకుడుగా మారారు. యాక్షన్ హీరో విశాల్, తమన్నా జంటగా సి. సుందర్ దర్శకత్వంలో రూపొందిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "యాక్షన్ "తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ "యాక్షన్ "మూవీ నవంబర్ 15వ తేదీ రిలీజ్ కానున్నాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను శ్రీనివాస్ ఆడెపు సమర్పిస్తున్నారు.
కథానాయకుడిగా అఖిల్ నటనాప్రస్థానానికి నాలుగేళ్ళు
బుడిబుడి అడుగుల ప్రాయంలోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న వైనం అఖిల్ అక్కినేని సొంతం. `సిసింద్రీ`(1995)గా మెస్మరైజ్ చేసిన ఈ స్టార్ కిడ్... సరిగ్గా 20 ఏళ్ళ తరువాత కథానాయకుడిగా తొలి అడుగులు వేశాడు. తన పేరుతోనే రూపొందిన `అఖిల్`(2015) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని వారి మూడో తరం కథానాయకుడు... మొదటి ప్రయత్నంలోనే నటుడిగా అలరించాడు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటనాప్రస్థానానికి 17 ఏళ్ళు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న ఈ తరం అగ్ర కథానాయకుడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినా... అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. చిత్రచిత్రప్రవర్థమానంగా ఎదుగుతూ వచ్చిన ప్రభాస్... ‘బాహుబలి’ సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. అలాగే... అనితరసాధ్యమైన ట్రాక్ రికార్డుతో ముందుకు సాగుతున్నాడు. అలాంటి ప్రభాస్ నటనాప్రస్థానానికి బీజం వేసిన చిత్రం ‘ఈశ్వర్’.
రవితేజ సినిమాలో స్టార్ డాటర్స్
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్ తనయ శ్రుతి హాసన్ కథానాయికగా నటించనుండగా... మరో స్టార్ డాటర్ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. ఆమె మరెవరో కాదు... సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్.
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కార్తికేయ ‘90 ML’
‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ’90 ML’. చదువులో బంగారు పతకాలు సాధించిన ఓ యువకుడు... దేవదాస్‌గా ఎందుకు మారాడు? అనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. నేహా సోలంకి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ శేఖర్ రెడ్డి ఎర్ర తెరకెక్కించాడు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించగా... అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.
బాలకృష్ణ చిత్రానికి అనిరుధ్ బాణీలు?
నటసింహా నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరి కలయికలో తెరకెక్కిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అటువంటి విజయవంతమైన జోడీ నుంచి ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. ఇందులో బాలయ్య రెండు షేడ్స్ ఉన్న పాత్రలో దర్శనమివ్వబోతున్నాడని సమాచారం. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... డిసెంబర్ 20న పూజా కార్యక్రమాలతో ప్రారంభమై, 2020 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని టాక్.
మహేష్, రాంచరణ్ బాటలో ఎన్టీఆర్..?
ఒకప్పుడు హీరోలుసంగతేమో కానీ ఇప్పుడు హీరోలు మాత్రం కాస్త ముందు చూపుతోనే వున్నారనిపిస్తుంది. ఎందుకంటే హీరో లంటే కేవలం సినిమాలు మాత్రమే చేయాలన్న రూల్ ను బ్రేక్ చేస్తున్నారు. అందుకే ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపార రంగాల్లోకి కూడా అడుగుపెడుతున్నారు. అందులో ముందు చెప్పుకోవాల్సింది మహేష్ బాబు గురించి. బిజినెస్ మ్యాన్ అనే టైటిల్ ఈ హీరో కి సరిగ్గా సరిపోతుంది. ఒక్క సినిమాలు మరో పక్క పలు ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్, మల్టీప్లెక్స్ బిజినెస్, ప్రొడక్షన్ హౌస్, ఈ మధ్యనే తన లేబుల్ తోనే బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఇలా పలు రంగాల్లో తన ప్రత్యేకతను చాటుతున్నాడు. ఇక మిగిలిన హీరోలు కూడా తమకంటూ…

#IFFI 50 ట్రెండ్ సెట్టర్స్ గా మన నటీనటులు..
'పెళ్లి చూపులు' అనే సినిమాలో డీసెంట్‌గా కనిపించి.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని షాక్ షేక్ చేసిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇక ఆ తర్వాత 'గీత గోవిందం', 'టాక్సీవాలా' సినిమాతో వెంటవెంటనే హిట్ లు కొట్టి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. అంతేకాదు యూత్ లో విజయ్ దేవరకొండ భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ నిర్మాత కూడా మారి సినిమాలు చేస్తున్నాడు.

హిందీలో కూడా వస్తున్న #prabhas20
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా వచ్చిన 'సాహో' ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అంచనాల మధ్య ఆగష్ట్ 30 వ తేదీన విడుదలైన ఈ సినిమా అందరిచేత 'సాహో' అనిపించుకుంది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 424 కోట్లను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. సాహో సినిమాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా తెలుగులో 200 పైగా కలెక్షన్స్ రాబట్టగా... హిందీలో 185 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

'అసురన్' రీమేక్‌కి ఆ డైరెక్టర్ కన్ఫర్మ్ అయ్యాడా ?
రీమేక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన కథానాయకుల్లో `విక్టరీ` వెంకటేష్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి పలు రీమేక్ మూవీస్‌లో నటించడమే కాకుండా... సింహభాగం ఘనవిజయాలు అందుకున్నారు వెంకీ. కాగా... తాజాగా ఈ సీనియర్ హీరో తమిళ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. డి.సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి దర్శకుడెవరన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఆ మధ్య ఓంకార్ పేరు వినిపించినా... అది వార్తలకే పరిమితం అయింది. తాజా సమాచారం ప్రకారం... ఆ అవకాశం యువ దర్శకుడు హను రాఘవపూడిని వరించిందని తెలిసింది.

20వ వసంతంలోకి 'చిరునవ్వుతో'
జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని చిరునవ్వుతో అధిగమిస్తూ ముందుకు సాగాలని చాటి చెప్పిన చిత్రం `చిరునవ్వుతో`. “ప్రేమించడం కంటే... ప్రేమించబడటం గొప్ప” అనే కాన్సెప్ట్‌లోంచి పుట్టిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో... వేణు, షహీన్ జంటగా నటించారు. ప్రేమ, ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సునీల్, గిరిబాబు, బ్రహ్మానందం, అలీ, సుధ, ప్రియ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జి.రామ్ ప్రసాద్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట శ్యామ్ ప్రసాద్ ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ని నిర్మించారు.

'బొమ్మరిల్లు' భామకి బంపర్ ఆఫర్ ?
‘సత్యం’, ‘బొమ్మరిల్లు’, ‘రెడీ’, ‘శశిరేఖా పరిణయం’... ఇలా పలు తెలుగు చిత్రాల్లో అభినయానికి అవకాశమున్న పాత్రల్లో కనిపించి నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది జెనీలియా. పెళ్ళయ్యాక మళ్ళీ తెలుగు సినిమాల్లో దర్శనమివ్వని ఈ టాలెంటెడ్ బ్యూటీ... తాజాగా ఓ మెగా ఆఫర్‌ను దక్కించుకున్నట్టు టాలీవుడ్ టాక్.
'జాన్' షూటింగ్ అప్ డేట్
సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు 'జాన్' సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్ లను కంప్లీట్ చేసుకుంది. అయితే ఇక ఇన్ని రోజులు సాహో సినిమా షూటింగ్, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చాడు.
సాలిడ్ గా 'నిశ్శబ్దం' ప్రీ రిలీజ్ బిజినెస్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు లో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
'సరిలేరు నీకెవ్వరు' కేరళ షెడ్యూల్ పూర్తి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక గతకొద్దికాలంగా కేరళ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. తాజాగా ఈ షెడ్యూల్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అంతా గ్రూప్ ఫోటో దిగారు. ఇందులో మహేష్ బాబు, రష్మిక, ప్రకాశ్ రాజ్, అనీల్ రావిపూడి, విజయశాంతి, రాజేంద్రప్రసాద్, సంగీత తదితరులు ఉన్నారు.

సీక్వెల్ కావచ్చు.. ప్రీక్వెల్ కావచ్చు - సినిమా మాత్రం పక్కా..!
ఒక్క దెబ్బకి మూడు పిట్టలు అన్నట్టు ఒక్క ఇస్మార్ట్ శంకర్ తో అటు హీరో రామ్ కి, నిర్మాతలు పూరి, ఛార్మి కి, నిధి అగర్వాల్ కి పెద్ద సక్సెసే దక్కింది. ఎప్పటినుండో రామ్ మంచి హిట్ కోసం చూస్తున్నాడు.. ఇక నిధి కూడా వచ్చిన రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఫస్ట్ హిట్ కోసం ఎదురుస్తుంది.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా హిట్ ఇచ్చి చాలా అయింది. అలా ఒకేసారి వీరందరికీ మంచి హిట్ ఇచ్చి కష్టకాలం నుండి బయటపడేసింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా 75కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఫ్రోజన్ 2 లో ఎల్సా పాత్రకు శృతి హాసన్ డబ్బింగ్
వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ క్రిస్ బక్, జెన్నీఫర్ లీ దర్శకత్వంలో ఎల్సా, అన్నాప్రధాన పాత్రలతో నిర్మించిన 3D కంప్యూటర్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీ మూవీ ఫ్రోజన్ 2013 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఫ్రోజన్ మూవీ కి సీక్వెల్ ఫ్రోజన్ 2 మూవీ రూపొంది ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది.

"విజయ్ సేతుపతి " మూవీ టీజర్ రిలీజ్
కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ సేతుపతి హీరోగా విజయ్ చందర్ దర్శకత్వంలో రూపొందిన సంగ తమిళ మూవీ, తమిళ తెలుగు డబ్బింగ్ వెర్షన్ విజయ్ సేతుపతి మూవీ రెండు భాషలలోనూ నవంబర్ 15 వ తేదీ రిలీజ్ కానున్నాయి. విజయ్ సేతుపతి డ్యూయల్ రోల్ లో నటించిన ఈ మూవీలో రాశీ ఖన్నా, నివేత పేతురాజ్ కథానాయికలు. నాజర్, అశుతోష్ రానా, రవి కిషన్ శుక్లా, తులసి ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ - మెర్విన్ సంగీతం అందించారు.

ఏడు చేపల కథ ఫస్ట్ డే కలెక్షన్స్
సినిమా టైటిల్ నుండి టీజర్, ట్రైలర్ లతోనే అందరికి షాకిచ్చి ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'ఏడు చేపల కథ'. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి షో కే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ యూత్ లో సినిమా పై ఉన్న క్రేజ్ తో అల్టిమేట్ కలెక్షన్స్ ని మొదటి రోజు అందుకుంది. ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా 1.06 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకోగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 1.13 కోట్ల షేర్ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర షాకింగ్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు అందుకుని సంచలనం సృష్టించింది.