బాల‌కృష్ణ‌కు జోడీగా ర‌చితా రామ్‌?

Kannada Actress Rachita Ram Pairs Up With Balakrishna,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actress Rachita Ram New Movie with Balakrishna,Balakrishna Next Movie Actress,Kannada Actress Rachita Ram,Rachita Ram Balakrishna Movie

నటసింహ నందమూరి బాలకృష్ణకు అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో బోయపాటి శ్రీను ఒక‌రు. జట్టుక‌ట్టిన రెండు సార్లూ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లుకొట్టిన ఘ‌న‌త ఈ కాంబినేష‌న్‌ది. `సింహా`, `లెజెండ్‌` రూపంలో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ ద్వ‌యం… హ్యాట్రిక్ మూవీకి సిద్ధ‌మ‌వుతోంది. గ‌త రెండు చిత్రాల్లోనూ బాల‌య్య‌ని రెండు విభిన్న పాత్ర‌ల్లో (ద్విపాత్రాభిన‌యం) చూపించిన బోయ‌పాటి… థ‌ర్డ్ జాయింట్ వెంచ‌ర్‌లో మాత్రం అందుకు భిన్నంగా రెండు షేడ్స్ ఉన్న‌ పాత్రలో ప్రెజెంట్ చేయ‌బోతున్నాడ‌ని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కన్నడ కస్తూరి రచితా రామ్ ని ఎంపిక చేశార‌ని టాక్‌. క‌న్న‌డ‌నాట స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ర‌చిత‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం కావ‌డం విశేషం. అయితే, ఈ టాలెంటెడ్ బ్యూటీకి తెలుగు సినిమాల‌తో ప‌రోక్షంగా క‌నెక్ష‌న్ ఉంది. `డార్లింగ్‌` క‌న్న‌డ వెర్ష‌న్ `బుల్ బుల్‌`తోనే ర‌చిత నాయిక‌గా తొలి అడుగులు వేయ‌గా… `అత్తారింటికి దారేది` క‌న్న‌డ వెర్ష‌న్ `రన్న‌`తోనూ మ‌రో సూప‌ర్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకుంది. త్వ‌ర‌లోనే ర‌చిత ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

కాగా… ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… డిసెంబర్ 20న పూజ‌తో ప్రారంభం కానుందని స‌మాచారం. 2020 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్… అదే ఏడాది మేలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రచారం సాగుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 3 =