ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 26
విజిల్, ఖైదీ వైజాగ్ కలెక్షన్స్

"యాక్షన్" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

'ఎంత మంచి వాడవురా' రిలీజ్ డేట్ ఫిక్స్
ఐటీ అధికారిగా బాలకృష్ణ?
రవితేజ సినిమాలో సముద్రఖని
చిరుతో మైత్రీ మూవీ మేకర్స్?
డిసెంబర్ 20న కార్తి కొత్త చిత్రం?
ఫస్ట్ సింగిల్స్‌తో ఇంప్రెస్ చేస్తున్న థమన్
'దర్బార్' మోషన్ పోస్టర్ రిలీజ్
మహేష్ మేనల్లుడి ఎంట్రీ కి రంగం సిద్ధం
థాయ్ ల్యాండ్ లో "పొన్నియిన్ సెల్వన్" మూవీ షూటింగ్
నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి
బాలీవుడ్ కామెడీ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్
యన్టీఆర్, సావిత్రి ‘మాతృదేవత’కు 50 ఏళ్ళు
వాస్తవ సంఘటనల ఆధారంగా #RT66 మూవీ
ప్రేమించడానికి సిద్ధం గా లేను - ఇలియానా
బ్లాక్ బస్టర్ మూవీ దేవదాసు తో టాలీవుడ్ కు ఎంటరయిన గోవా బ్యూటీ ఇలియానా నటించిన పోకిరి, జల్సా, కిక్, జులాయి మూవీస్ ఘన విజయం సాధించాయి. సూపర్ హిట్ బర్ఫీ మూవీ తో ఇలియానా బాలీవుడ్ లో ప్రవేశించారు. ఇలియానా నటించిన ఫటా పోస్టర్ నిఖ్లా హీరో, మై తేరా హీరో, రుస్తుం, ముబారకన్, బాద్ షా హో, రైడ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. 6 సంవత్సరాల తరువాత ఇలియానా అమర్ అక్బర్ ఆంథోనీ మూవీ తో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చారు.
విజిల్, ఖైదీ వైజాగ్ కలెక్షన్స్
అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బిగిల్'. తెలుగులో 'విజిల్' అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇక్కడ 10 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా మొదటి వారానికి 8.93 షేర్ ను రాబట్టింది. ఇక పది రోజులకు గాను 10.09 కోట్లు రాబట్టింది.

"యాక్షన్" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
యాక్షన్ హీరో విశాల్ మూవీస్ కు కోలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందో టాలీవుడ్ లో అంతే క్రేజ్ ఉంది. ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్ పై సుందర్.సి దర్శకత్వంలో విశాల్, తమన్నా జంటగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ యాక్షన్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 15వ తేదీ రిలీజ్ కానున్నాయి. హీరో విశాల్ కల్నల్ సుభాష్ అనే ఆఫీసర్ పాత్రలో, తమన్నా కాప్ పాత్రలో నటించారు. హిప్ హప్ తమిళ సంగీతం అందించారు.

'ఎంత మంచి వాడవురా' రిలీజ్ డేట్ ఫిక్స్
సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. ఇక ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చింది. కేరళలోని మున్నార్ తదితర సుందరమైన ప్రదేశాల్లో చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఐటీ అధికారిగా బాలకృష్ణ?
`యన్టీఆర్` బయోపిక్ తరువాత నటసింహ బాలకృష్ణ నుంచి వస్తున్న చిత్రం `రూలర్`. కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాడు. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తుండగా... భూమిక, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో... పోలీస్ ఆఫీసర్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనున్నారు బాలయ్య. ఇప్పటికే ఈ రెండు లుక్స్‌కి సంబంధించిన పోస్టర్స్‌ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించి మరో కోణం…
రవితేజ సినిమాలో సముద్రఖని
తమిళనాట దర్శకుడిగానూ, నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని... తెలుగువారికి కూడా సుపరిచితుడే. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘శంభో శివ శంభో’(2010), నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెండాపై కపిరాజు’(2014)... సముద్రఖని దర్శకత్వంలోనే రూపొందాయి. ఓ వైపు దర్శకుడిగా రాణిస్తూనే, మరోవైపు నటుడిగానూ పలు తమిళ చిత్రాలలో నటిస్తూ వస్తున్న ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్... ఇప్పుడు నటుడిగా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించడానికి సిద్ధపడుతున్నాడు.
చిరుతో మైత్రీ మూవీ మేకర్స్?
మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చిన నిర్మాణ సంస్థల్లో హ్యాట్రిక్ విజయాల సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ‘రంగస్థలం’ వంటి మెమరబుల్ బ్లాక్‌బస్టర్‌ని అందించిన మైత్రీ... ఆపై వరుస పరాజయాల్లో ఉన్న మరో మెగాహీరో సాయితేజ్ కి ‘చిత్రలహరి’ రూపంలో విజయాన్ని అందించింది. అంతేకాదు... సాయితేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రస్తుతం ‘ఉప్పెన’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది మైత్రీ.
డిసెంబర్ 20న కార్తి కొత్త చిత్రం?
దీపావళి కానుకగా విడుదలైన ‘ఖైదీ’తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కార్తి. తమిళ, తెలుగు భాషల్లో ఒకే రోజున రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ అయింది. కాగా, ఒకవైపు `ఖైదీ` విజయాన్ని ఆస్వాదిస్తూనే... మరోవైపు తదుపరి చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నాడు కార్తి. అంతేకాదు... ఫ్యామిలీ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే తెరపైకి రానుందని సమాచారం.
ఫస్ట్ సింగిల్స్‌తో ఇంప్రెస్ చేస్తున్న థమన్
సరిగ్గా పదేళ్ళ క్రితం తెలుగునాట `కిక్`ఇచ్చే ఓ కొత్త సౌండింగ్ పరిచయమైంది. `రేసుగుర్రం`లా దూసుకొచ్చి `దూకుడు` చూపించిన ఆ స్వరప్రస్థానం.. చూస్తుండగనే తొమ్మిదేళ్ళకే శతకం పూర్తిచేసి ఔరా అనిపించింది. ఉవ్వెత్తున ఎగసిపడిన ఆ స్వరతరంగమే... యస్.యస్. థమన్.
'దర్బార్' మోషన్ పోస్టర్ రిలీజ్
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రజినీకాంత్ కు సంబంధించి పలు లుక్స్ ను రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
'డిస్కోరాజా' రిలీజ్ డేట్ ఫిక్స్ - త్వరలో రానున్న టీజర్
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి ఇటీవలే మొదటి పాటని రిలీజ్ చేశారు. ఇక నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అప్ డేట్ ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మహేష్ మేనల్లుడి ఎంట్రీ కి రంగం సిద్ధం
మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య దిల్ రాజు బ్యానర్ లో సినిమా ప్రారంభించగా అది ఆగిపోయింది. అయితే మళ్లీ వేరే ప్రాజెక్ట్ సెట్ చేశారు. కాగా గతంలో 'భలే మంచి రోజు' 'శమంతకమణి' మరియు దేవదాసు సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.
నవ్వించినా... ఏడిపించినా ఈయనకే సాటి..!
ఆకెళ్ళ నాగ శ్రీనివాస వర్మ... ఈ పేరు ఎవరిదబ్బా అని అనుకుంటున్నారా..? అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పండి ఎవరికైనా అర్ధమవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్లు, రచయితలు వున్నా త్రివిక్రమ్ స్టైల్ వేరు. పంచులు, ప్రాసలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే త్రివిక్రమ్ అనే చెబుతారు ఎవరైనా.. తన పంచులు ప్రాసలతో నవ్విస్తాడు.. ఎమోషనల్ డైలాగ్స్ తో కన్నీళ్లు పెట్టిస్తాడు.. సందేశాత్మక సన్నివేశాలతో ఆలోచింపచేస్తాడు.. తన కలం నుండి రాలే ప్రతి అక్షరానికి కొత్త అర్ధం వస్తుంది. చాలా సరళమైన.. మనకు అర్ధమయ్యే భాషలోనే మనిషి విలువలు గురించి చెప్తాడు. అలా అని పేరాల పేరాలు డైలాగ్స్ ఉంటాయా అంటే తప్పే.. చాలా షార్ట్ అండ్…
థాయ్ ల్యాండ్ లో "పొన్నియిన్ సెల్వన్" మూవీ షూటింగ్
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పీరియా డిక్ డ్రామా "పొన్నియన్ సెల్వన్ "మూవీ భారీ బడ్జెట్, భారీ తారాగణంతో రెండు భాగాలుగా రూపొందనుంది. తమిళ కింగ్ రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనున్న" పొన్నియన్ సెల్వన్ "మూవీ లో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, జయరామ్, మోహన్ బాబు, ఆది , ఐశ్వర్యారాయ్, కీర్తి సురేష్ ప్రధాన తారాగణం. కోలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రలలో నటించనున్నారు.
నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి
లెజండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ చిత్ర సీమ లో ప్రవేశించి ఈ రోజు తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. KA అబ్బాస్ దర్శకత్వంలో రూపొందిన సాత్ హిందూస్థానీ మూవీ తో అమితాబ్ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. సాత్ హిందూస్థానీ మూవీ 1969 నవంబర్ 7 వ తేదీ రిలీజయింది. ఆ మూవీ తో మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్ గా అమితాబ్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు. సాత్ హిందూ స్థానీ మూవీ ఢిల్లీ లో రిలీజయిన కొన్ని నెలల తరువాత ముంబై లో రిలీజ్ కావడం విశేషం. సూపర్ హిట్ ఆనంద్ మూవీ తో అమితాబ్ ముంబై వాసులకు పరిచయమయ్యారు.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్
ఒక అరుంధతి చేయాలన్నా.. దేవసేన చేయాలన్నా.. రుద్రమదేవి చేయాలన్నా.. భాగమతి చేయలన్నా ఒకే ఒక్క హీరోయిన్ వల్ల అవుతుంది. ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా.. వన్ అండ్ ఓన్లీ అనుష్క. అందం, అభినయం ఉండి లక్ లేకపోయినా.. లక్ ఉండి మిగిలిన రెండూ లేకపోయినా కష్టమే.. కానీ అందం, అభినయం తో పాటు లక్ కూడా వున్న హీరోయిన్ అనుష్క. అయితే తొలినాళ్లలో అనుష్క కూడా పలు ప్లాప్స్ మూటగట్టుకుందనుకోండి. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ స్టార్ హీరోయిన్ గా.. తన కోసం స్టోరీ లు రాసి సినిమా తీసే అంత స్థాయికి ఎదిగింది.
అల .. వైకుంఠ పురములో .. మలయాళ డబ్బింగ్ వెర్షన్ టైటిల్ రిలీజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న అల .. వైకుంఠ పురములో.. మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. అల్లుఅర్జున్ మూవీస్ మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ కమర్షియల్ గా విజయం సాధిస్తాయి. కేరళ రాష్ట్రంలో అల్లుఅర్జున్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. అల .. వైకుంఠ పురములో . మూవీ లో థమన్S స్వరకల్పనలో రూపొందిన సామజవరగమన , రాములో రాములా సాంగ్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది. రెండు సాంగ్స్ కలిపి 150 మిలియన్స్ వ్యూస్ సాధించాయి.
బాలీవుడ్ కామెడీ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్
తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ వరుస తెలుగు, తమిళ, హిందీ మూవీస్ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. సూపర్ హిట్ మూవీ యారియాన్ తో బాలీవుడ్ లో ప్రవేశించిన రకుల్ నటించిన దే దే ప్యార్ దే మూవీ ఘనవిజయం సాధించింది. రకుల్ హీరోయిన్ గా నటించిన మర్జవాన్ మూవీ నవంబర్ 8వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రకుల్ మరో బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
యన్టీఆర్, సావిత్రి ‘మాతృదేవత’కు 50 ఏళ్ళు
“మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ.. త్యాగములో అనురాగములో తరగని పెన్నిధి మగువ...” అంటూ స్త్రీమూర్తి గొప్పతనాన్ని చాటిచెప్పిన చిత్రం ‘మాతృదేవత’. `మహానటి` సావిత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మహానటుడు యన్.టి.రామారావు, మహానటి సావిత్రి జంటగా నటించారు. శోభన్‌బాబు, రేలంగి, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి, జగ్గారావు, రాజబాబు, చంద్రకళ, విజయలలిత, హేమలత, సురభి బాలసరస్వతి ముఖ్య భూమికలు పోషించారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా #RT66 మూవీ
ఠాగూర్ మధు నిర్మాణ సారథ్యం లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ హీరోగా మాస్ ఎంటర్ టైనర్ #RT66 మూవీరూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరో గా రూపొందిన బ్లాక్ బస్టర్ తెరి మూవీ కి రీమేక్ అని ఊహాగానాలు చెలరేగాయి. #RT66 మూవీ ఏ మూవీ కి రీమేక్ కాదని, వాస్తవ సంఘటనల ఆధారంగా #RT66 మూవీ రూపొందనుందని దర్శకుడు వెల్లడించారు. శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. రవితేజ సూపర్ హిట్ మూవీ కిక్ తో టాలీవుడ్ కు సంగీత దర్శకుడిగా పరిచయమైన థమన్ S సంగీతం అందిస్తారు.