టైటిల్ తోనే తన సినిమాలకు ఎక్కడా లేని క్రేజ్ ను తీసుకొచ్చే వర్మ.. ఈసారి ఏకంగా రెండు వర్గాల పేర్లనే టైటిల్ గా తీసుకొని ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అన్న సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వర్మ ప్రమోషన్స్ ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టీజర్, ట్రైలర్, పాటలతోనే సగం సినిమాకు క్రేజ్ తీసుకొస్తాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేసి… డైరెక్ట్ గా పలు రాజకీయ నేతలపైనే సెటైర్లు వేసాడు. ఇప్పుడు తాజాగా మరో పాటతో రెడీ అయ్యాడు. తాజాగా ఈ సినిమా నుండి ‘పప్పు లాంటి అబ్బాయి’ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసి షాకిచ్చాడు. మరి ఈ పాట ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో చంద్రబాబు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పవన్ కళ్యాణ్, కేఏ పాల్‌లను పోలిన నటులు నటిస్తుండగా.. జగన్ పాత్రలో రంగం ఫేం అజ్మల్ అమీర్, అలీ, బ్రహ్మానందం నటిస్తున్నారు. అజయ్ మైసూర్ సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేసే యోచనలో ఉన్నాడు వర్మ.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: