ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 2
లక్కీ సీజన్‌లో 'అల్లరి' నరేష్ 'డబుల్ ధమాకా' మిస్
వరుసగా మూడోసారి రజినీకాంత్ సంక్రాంతి సందడి
టీనేజ్ అమ్మాయికి తండ్రిగా బాలకృష్ణ?
ఫ్యాన్స్ కు ఇదే నా విజ్ఞప్తి..!
భార్యకు ప్రేమతో గోపీచంద్ ..!
కామెడీ థ్రిల్లర్ మూవీ లో హీరో నాని
ఫైనల్లీ.. తన లవ్ ను బయటపెట్టిన రానా..!

15 సంవత్సరాల సినీ కెరీర్ పూర్తి
ఒరిస్సా మహిళా ఎస్ ఐ కు అభినందనలు
పవన్ కు జోడిగా మలయాళీ భామ..!
రియల్ హీరో గా మారిన రీల్ విలన్
పోరాట ఘట్టాలు మినహా 'కేజీఎఫ్: చాప్టర్ 2' పూర్తి
'పవన్ 28'కి దేవిశ్రీప్రసాద్ స్వరాలు
భారీ చిత్రాల హీరో ఎన్టీఆర్
స్టాండప్ కమెడీయన్‌గా రాజ్ తరుణ్?
యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తాజా చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’ ఉగాదికి విడుదల కావాల్సింది. అయితే, కరోనా కారణంగా వాయిదా పడింది. లాక్ డౌన్ అనంతరం ఈ సినిమా థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. ఈ లోపే.. రాజ్ తరుణ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. నూతన దర్శకుడు సంతోష్ మోహన్ వీరంకి తెరకెక్కించబోతున్న ఈ సినిమాని నందకుమార్ నిర్మించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని.. లాక్ డౌన్ అనంతరం సెట్స్ పైకి తీసుకువెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
లక్కీ సీజన్‌లో 'అల్లరి' నరేష్ 'డబుల్ ధమాకా' మిస్
కథానాయకుడిగా 'అల్లరి' నరేష్‌ది పద్దెనిమిదేళ్ళ నటనా ప్రస్థానం. 2002లో విడుదలైన 'అల్లరి' చిత్రంతో నరేష్ కెరీర్ ప్రారంభమైంది. ఆ ఏడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఆపై ఇదే సీజన్‌లో వచ్చిన 'అల్లరి' నరేష్ పలు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
వరుసగా మూడోసారి రజినీకాంత్ సంక్రాంతి సందడి
సూపర్ స్టార్ రజినీకాంత్‌కి అచ్చొచ్చిన సీజన్స్‌లో సంక్రాంతి ఒకటి. పొంగల్ బరిలో దిగిన రజినీ పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలోనే.. రజినీ తాజా చిత్రం 'అణ్ణాత్త' కూడా సంక్రాంతి సీజన్‌లోనే సందడి చేయనుంది. 'శౌర్యం' శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని.. తొలుత ఆయుధపూజ రోజున విడుదల చేయాలని యూనిట్ భావించింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో 2021 సంక్రాంతికి వాయిదా వేశారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా…
టీనేజ్ అమ్మాయికి తండ్రిగా బాలకృష్ణ?
నటసింహ బాలకృష్ణ, నిన్నటితరం అగ్రశ్రేణి దర్శకుడు బి.గోపాల్‌ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో 5 చిత్రాలు రాగా.. వాటిలో నాలుగు సినిమాలు సంచలనం సృష్టించాయి. 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్‌స్పెక్టర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు'.. ఇలా బాలయ్య, గోపాల్ కాంబినేషన్‌లో 4 బ్లాక్‌బస్టర్ మూవీస్ ఉన్నాయి. కట్ చేస్తే.. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. బాలయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుందని ప్రచారం సాగుతోంది.
రానా పెళ్లిపై సురేష్ బాబు - ఈ ఏడాది లోనే ఉంటుంది..!
అసలు పెళ్లి ప్రస్తావన వస్తేనే అప్పుడే ఎవరు చేసుకుంటారు అని చెప్పే టాలీవుడ్ హంక్ రానా.. ఫైనల్లీ అందరికీ తన ప్రేమను పరిచయం చేసే పెద్ద షాక్ ఇచ్చాడు. నిన్న సోషల్ మీడియాలో చాలా సింపుల్ గా తన ప్రేయసిని పరిచయం చేయగా ఒక్కసారిగా ఈ న్యూస్ సెన్సేషన్ అయిపోయింది. రానా పెళ్లి చేసుకోబోతున్నాడని దేశవ్యాప్తంగా ఈ న్యూస్ వైరల్ అయిపోయింది. ఇక టాలీవుడ్ నుండే కాక పలువురు ప్రముఖుల నుండి రానాకు అభినందనలు అందుతున్నాయి. ఇక అప్పుడు రానా పెళ్లి ఎప్ప్పుడు అన్న దానిపై వార్తలు మొదలయ్యాయి. ఇక పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చారు రానా రానా తండ్రి సురేష్ బాబు.
ఫ్యాన్స్ కు ఇదే నా విజ్ఞప్తి..!
కరోనాతో దేశం పెద్ద యుద్ధమే చేస్తుంది. అందరూ ఇళ్లల్లోనే ఉంటూ పోరాడుతున్నారు. ఇక ఈ కరోనా వల్ల పెళ్లిళ్లు పలు వేడుకలకు కూడా దూరమయ్యారు ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు, సన్నిహితులు, స్నేహితులను ఇబ్బంది పెట్టకూడదని ఎనర్జిట్ స్టార్ రామ్ పోతినేని నిర్ణయం తీసుకొన్నారు. మే 15న రామ్ పుట్టినరోజు. అయితే ఈ సందర్భంగా రామ్ పోతినేని తన అభిమానులు ఎవరు తన బర్త్ డే వేడుకలు చేయోద్దంటూ రిక్వెస్ట్ చేసాడు. ప్రస్తుతం మన దేశం కరోనా అనే మహామ్మారితో పోరాడుతోంది. ఈ సమయంలో అందరు ఇంట్లోనే ఉంటూ కరోనానను తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చాడు.
భార్యకు ప్రేమతో గోపీచంద్ ..!
యాక్షన్ హీరో హీరో గోపీచంద్, రేష్మ ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. 2013 మే 12న వీరి వివాహం జరిగింది. శ్రీకాంత్ మేనకోడలు రేష్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పెళ్లై ఏడు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక ఈ రోజు పెళ్లి రోజు కావడంతో గోపీచంద్ తన భార్య గురించి చెప్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కామెడీ థ్రిల్లర్ మూవీ లో హీరో నాని
హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" కరోనా మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది. హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
ఫైనల్లీ.. తన లవ్ ను బయటపెట్టిన రానా..!
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో కొంత మంది హీరోల పేర్లు టక్కున వచ్చేస్తాయి. అయితే వారిలో కూడా ముందొచ్చే పేరు రానా. రానా పెళ్లి, ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు హాట్ టాపిక్కే . ఎప్పుడూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటుంది. ఇక ఇన్ని రోజులు తన పెళ్లి గురించి.. ప్రేమ గురించి ఏ ప్రశ్నలు అడిగినా నవ్వుతో సమాధానం చెప్పే రానా తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఓ సర్పైజ్ ఇచ్చాడు. మామూలు విషయం కాదు తన ప్రేయసిని పరిచయం చేశాడు. తన ప్రపోజల్ కి ఆమె ఎస్ అన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో పాటు వారి ఫోటోను కూడా పంచుకున్నాడు. చాలా కాలంగా రానా పెళ్లి పై వార్తలు వస్తుండగా నేడు ఆయన కాబోయే భార్యను…

15 సంవత్సరాల సినీ కెరీర్ పూర్తి
సూపర్ హిట్ "భద్ర " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి శ్రీను "తులసి" , "సింహా" , "లెజెండ్", "సరైనోడు " వంటి సూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వంవహించారు. మాస్ చిత్ర దర్శకుడిగా పేరుపొందిన బోయపాటి శ్రీను ఈ రోజుతో 15 సంవత్సరాల సినీ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నారు. బోయపాటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా #NBK106 మూవీ రూపొందిస్తున్నారు. బోయపాటి , బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన "సింహా" , "లెజెండ్" మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
ఒరిస్సా మహిళా ఎస్ ఐ కు అభినందనలు
కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా లో ప్రవేశించిన మెగా స్టార్ చిరంజీవి తన వ్యక్తిగత విషయాలతో పాటు కరోనా వైరస్ పై అవగాహనా ట్వీట్స్ చేస్తున్నారు. సామజిక అంశాల పట్ల స్పందిస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన శుభశ్రీ అనే మహిళా ఎస్ ఐ ఒక మానసిక , శారీరక వికలాంగురాలైన ఒక మహిళ కు చేసిన సేవలకు చిరంజీవి స్పందించి ఆ మహిళా ఎస్ ఐ శుభశ్రీ తో స్వయంగా మాట్లాడి అభినందించారు.
పవన్ కు జోడిగా మలయాళీ భామ..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వల్ల రిలీజ్ కు నోచుకోలేదు. లాక్ డౌన్ తీసేసినా ఈ ఏడాది ఈ సినిమా రావడం కష్టమే అంటున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత క్రిష్ తో మరో సినిమాను చేస్తున్నాడు పవన్. పీరియాడిక్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కబోతుంది
వెబ్ సిరీస్ అనుమతి కోసం ప్రభుత్వానికి అల్లు అరవింద్ రిక్వెస్ట్..!
కరోనా వల్ల సినీ పరిశ్రమకు పెద్ద సమస్యలే వచ్చి పడ్డాయి. ఏదో చిన్న చిన్న పనులంటే ఇంట్లో ఉండి కానిచ్చేస్తున్నారు కానీ అన్ని పనులు అవ్వాలంటే కష్టం. జూన్ నుండి షూటింగ్ లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నా అది ఎంత వరకూ సాధ్యపడుతుందో తెలియదు. కేరళ లాంటి రాష్ట్రాల్లో.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతులు ఇచ్చారు. అక్కడ షూటింగులు కూడా మొదలయ్యే ఛాన్సుంది. కానీ ఇక్కడ మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. విదేశాల్లో షూటింగ్ అనే ఆలోచనే లేదు. దానికోసం స్క్రిప్ట్ లో మార్పులు చేసుకుంటున్నారట దర్శక నిర్మాతలు.
రియల్ హీరో గా మారిన రీల్ విలన్
"సూపర్ ", "అతడు ", అరుంధతి", " దూకుడు", "జులాయి "వంటి సూపర్ హిట్ మూవీస్ లో విలన్ గా ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ నటుడు సోను సూద్ తమిళ, కన్నడ మూవీస్ లో కూడా నటించారు. "అరుంధతి " మూవీ లో పశుపతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సోను సూద్ బెస్ట్ విలన్ గా నంది అవార్డ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. 2దశాబ్దాలుగా ప్రతినాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న సోను సూద్ కరోనా బాధితులను ఆదుకుంటూ రియల్ హీరో గా మారారు.
పోరాట ఘట్టాలు మినహా 'కేజీఎఫ్: చాప్టర్ 2' పూర్తి
పాన్ ఇండియా మూవీగా రిలీజైన కన్నడ చిత్రం 'కేజీఎఫ్: చాప్టర్ 1'.. నేషనల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామాకి సంబంధించిన సెకండ్ పార్ట్ 'కేజీఎఫ్: చాప్టర్ 2'.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

మణిరత్నం ఏకైక తెలుగుచిత్రం ‘గీతాంజలి’కి 31 ఏళ్ళు
‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన చిత్రం ‘గీతాంజలి’. నాగ్‌లోని నటుణ్ణి సరికొత్త కోణంలో ఆవిష్కరించిన సినిమా ఇది. అలాగే, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఏకైక తెలుగు చిత్రం ‘గీతాంజలి’ కావడం విశేషం. తెలుగునాట క్లాసిక్‌గా నిలిచిన ఈ ప్రణయ దృశ్యకావ్యంలో నాగ్‌కు జోడిగా గిరిజ(తొలి పరిచయం) నటించింది. విజయకుమార్, విజయచందర్, సుమిత్ర, ముచ్చర్ల అరుణ, 'డబ్బింగ్' జానకి, బేబీ నీనా ముఖ్య భూమికలు పోషించగా.. చంద్రమోహన్, ‘షావుకారు’ జానకి, డిస్కో శాంతి, సుత్తి వేలు ప్రత్యేక పాత్రల్లో నటించారు. సిల్క్ స్మిత స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది.
"ఇచ్చట వాహనములు నిలుపరాదు "మూవీ సుశాంత్ లుక్
సక్సెస్ ఫుల్ "కాళిదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సుశాంత్ "కరెంట్ ", "చి || ల || సౌ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠ పురములో .. మూవీ లో ఒక కీలక పాత్రలో నటించిన సుశాంత్ ఇప్పుడు నిజ సంఘటనల ప్రేరణతో రూపొందుతున్న ఒక మూవీ లో హీరోగా నటిస్తున్నారు. రవి శంకర్ శాస్త్రి , హరీష్ కోయలగండ్ల నిర్మాతలు.
'పవన్ 28'కి దేవిశ్రీప్రసాద్ స్వరాలు
'గబ్బర్ సింగ్' (2012) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మించనుంది. కాగా, ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నాడు. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించాడు.
కన్నీళ్లు పెట్టించే విధంగా 'సాయి పల్లవి' పాత్ర..!
ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన తమిళ బ్యూటీ సాయిపల్లవి. ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ తో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. తన అందం దానికి తగిన అభినయంతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అయితే సాయి పల్లవి గురించి తెలుసు కదా.. కేవలం పాత్ర ప్రాధాన్యమైన పాత్రలు మాత్రమే ఎంచుకుంటదని. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తుంది. దానితో పాటు 'విరాట పర్వం' సినిమా చేస్తుంది.
భారీ చిత్రాల హీరో ఎన్టీఆర్
టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాలతో యంగ్ రెబల్ స్టార్ ముందుండగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 400 కోట్ల తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో నటిస్తున్నారు.