రానా పెళ్లిపై సురేష్ బాబు – ఈ ఏడాది లోనే ఉంటుంది..!

Suresh Babu talk about Rana Daggubati's Marriage
Suresh Babu talk about Rana Daggubati's Marriage

అసలు పెళ్లి ప్రస్తావన వస్తేనే అప్పుడే ఎవరు చేసుకుంటారు అని చెప్పే టాలీవుడ్ హంక్ రానా.. ఫైనల్లీ అందరికీ తన ప్రేమను పరిచయం చేసే పెద్ద షాక్ ఇచ్చాడు. నిన్న సోషల్ మీడియాలో చాలా సింపుల్ గా తన ప్రేయసిని పరిచయం చేయగా ఒక్కసారిగా ఈ న్యూస్ సెన్సేషన్ అయిపోయింది. రానా పెళ్లి చేసుకోబోతున్నాడని దేశవ్యాప్తంగా ఈ న్యూస్ వైరల్ అయిపోయింది. ఇక టాలీవుడ్ నుండే కాక పలువురు ప్రముఖుల నుండి రానాకు అభినందనలు అందుతున్నాయి. ఇక అప్పుడు రానా పెళ్లి ఎప్ప్పుడు అన్న దానిపై వార్తలు మొదలయ్యాయి. ఇక పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చారు రానా రానా తండ్రి సురేష్ బాబు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విషయం తెలిసిన వెంటనే ఓ ఛానల్ ఇంటర్వ్యూ నిర్వహించగా.. ఈ భయంకరమైన సమయంలో సెలెబ్రేట్ చేసుకోడానికి ఒక మంచి రీజన్ దొరికింది..మేము చాలా సంతోషంగా ఉన్నాం.. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎప్పటినుండో తెలుసు.. వారిద్దరి పట్ల మేము చాలా హ్యాపీగా ఉన్నామన్నారు. అంతేకాదు పెళ్లి గురించి మాట్లాడటానికి అప్పుడే కరెక్ట్ టైం కాదని..త్వరలోనే అన్ని వివరాలు తెలుపుతామని చెప్పారు. అంతేకాదు ఈ ఏడాదిలోనే పెళ్లి ఉంటుందని..డిసెంబర్ లో పెళ్లి ఉంటుంది.. అంతకు ముందే జరిగినా మేము చాలా హ్యాపీ అని స్పష్టం చేశాడు. ఇప్పుడే కదా మొదలైంది.. అన్నీ ఫైనల్ అయిన తర్వాత అప్పుడు పూర్తి వివరాలు తెలియచేస్తాం అని అన్నారు.

మొత్తానికి టాలీవుడ్ లో బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. అసలు పెళ్లి చేసుకుంటాడా అనుకున్న రానానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే.. ఇక ప్రభాస్ పెళ్లి వార్త కూడా త్వరలోనే వింటావేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 6 =