మ‌ణిర‌త్నం ఏకైక తెలుగుచిత్రం ‘గీతాంజలి’కి 31 ఏళ్ళు

Legendary Film Director Mani Ratnam One and Only Telugu Movie Geethanjali Completes 31 Years.

‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన చిత్రం ‘గీతాంజలి’. నాగ్‌లోని న‌టుణ్ణి సరికొత్త కోణంలో ఆవిష్కరించిన సినిమా ఇది. అలాగే, లెజెండరీ డైరెక్టర్ మ‌ణిర‌త్నం రూపొందించిన ఏకైక తెలుగు చిత్రం ‘గీతాంజలి’ కావ‌డం విశేషం. తెలుగునాట క్లాసిక్‌గా నిలిచిన ఈ ప్ర‌ణ‌య దృశ్య‌కావ్యంలో నాగ్‌కు జోడిగా గిరిజ(తొలి ప‌రిచ‌యం) నటించింది. విజయకుమార్, విజయచందర్, సుమిత్ర, ముచ్చర్ల అరుణ, ‘డబ్బింగ్’ జానకి, బేబీ నీనా ముఖ్య భూమికలు పోషించగా.. చంద్రమోహన్, ‘షావుకారు’ జానకి, డిస్కో శాంతి, సుత్తి వేలు ప్రత్యేక పాత్రల్లో న‌టించారు. సిల్క్ స్మిత స్పెష‌ల్ సాంగ్‌లో సంద‌డి చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దిగ్గజ గీతరచయిత వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు ‘ల‌య‌రాజా’ ఇళయరాజా స‌మ‌కూర్చిన బాణీలు అజరామరంగా నిలిచిపోయాయి. “ఓ ప్రియా ప్రియా”, “ఆమని పాడవే”, “జల్లంత కవ్వింత”, “ఓ పాపాలాలి”, “నందికొండ వాగుల్లోన”, “జగడ జగడ జగడం”, “ఓం నమహా”.. ఇలా ఇందులోని ప్రతీ పాట నిత్యనూతనమే.

భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌ప్రైజెస్‌ పతాకంపై సి.ప్రవీణ్ కుమార్ రెడ్డి, పి.ఆర్.ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం.. బెస్ట్ పాపులర్ ఫిలింగా నేషనల్ అవార్డును హస్తగతం చేసుకోవడమే కాకుండా.. ఉత్తమ చిత్రం, ఉత్తమ క‌థార‌చ‌యిత‌(మణిరత్నం), ఉత్తమ హాస్య న‌టుడు(సుత్తివేలు) ఉత్తమ నృత్య ద‌ర్శ‌కుడు(సుందరం), ఉత్తమ క‌ళాద‌ర్శ‌కుడు(తోట తరణి), ఉత్తమ ఛాయాగ్రాహ‌కుడు(పి.సి.శ్రీరామ్) విభాగాల‌లో `నంది` అవార్డులను కైవసం చేసుకుంది. అంతేకాకుండా.. బెస్ట్ డైరెక్టర్ – తెలుగు కేటగిరీలో `ఫిలింఫేర్‌`ను సొంతం చేసుకున్నారు మణిరత్నం. అలాగే త‌మిళంలో `ఇద‌య‌త్తై తిరుడాదే` పేరుతో అనువాద‌మై… అక్క‌డా ప్ర‌జాద‌ర‌ణ పొందింది. ‘యాద్ రఖేగి దునియా’(1992) పేరుతో ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయడం విశేషం. 1989 మే 12న విడుద‌లై అఖండ విజయం సాధించిన ‘గీతాంజలి’.. నేటితో 31 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 11 =