
ట్యాగ్ · 1690 కథనాలు

బిజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్
గోపీచంద్ "పక్కా కమర్షియల్" ?
కోలీవుడ్ లో రాశీఖన్నా బిజీ

మరో థ్రిల్లర్ తో వస్తున్న ‘118’ డైరెక్టర్
బాలీవుడ్ లో బిజీగా షాలిని పాండే
సితార ఉంటే చాలు.. ప్లే లిస్ట్ అవసరం లేదు..!
మా కుటుంబంలోకి నీకు స్వాగతం రానా..!
బాలీవుడ్ రీమేక్ మూవీ లో రాజ్ తరుణ్
ప్రజా గాయకురాలు పాత్ర లో సాయి పల్లవి ?
విక్రమ్ "కోబ్రా "మూవీ అప్ డేట్
KGF చాప్టర్ 2 మూవీ రిలీజ్ వాయిదా ?
రేపే యంగ్ హీరో నిఖిల్ పెళ్లి..!
బాలీవుడ్ పై ఆసక్తి

జగపతిబాబు, లయ ‘మనోహరం’కి 20 ఏళ్ళు
సోషల్ మీడియాలో సాయితేజ్ హవా
ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండ సంచలనం

హ్యాపీ బర్త్ డే మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలను లాజిక్కులు లేకుండా చూస్తూనే బెటర్. కామెడీ థ్రిల్లర్ కాబట్టి ప్రతిఒక్కరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.
బిజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్
11 సంవత్సరాల వయస్సు లో సహాయ సంగీత కళాకారుడిగా సూపర్ హిట్ "భైరవ ద్వీపం"మూవీ తో థమన్ ఎస్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "సింధనై సెయ్ "మూవీ తో కోలీవుడ్ , "మళ్ళీ మళ్ళీ "మూవీ తో టాలీవుడ్ కు థమన్ ఎస్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించిన థమన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా "దూకుడు "మూవీ కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న థమన్ 2020 సంవత్సరంలో 8 సినిమాలకు సంగీతం అందించారు.
హీరో ప్రభాస్ తో నటించాలని ఉంది -వరలక్ష్మి శరత్ కుమార్
సక్సెస్ ఫుల్ "పోడా పోడి "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన వరలక్ష్మీ శరత్ కుమార్ పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరించారు. 'తెనాలి రామకృష్ణ BABL"మూవీ తో వరలక్ష్మి టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కన్నడ , మలయాళ భాషల మూవీస్ లో నటించిన వరలక్ష్మి నెగటివ్ పాత్రలకు పెట్టింది పేరుగా మారారు. వరలక్ష్మి ప్రస్తుతం 6 తమిళ మూవీస్ , ఒక కన్నడ మూవీ , తెలుగు లో అల్లరి నరేష్ "నాంది", రవితేజ "క్రాక్ " మూవీస్ లో నటిస్తున్నారు.
గోపీచంద్ "పక్కా కమర్షియల్" ?
పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో హీరో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు. "సీటీ మార్ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో గోపీచంద్ ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కోలీవుడ్ లో రాశీఖన్నా బిజీ
ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో ఫోటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు సూపర్ హిట్ తెలుగు మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రాశీఖన్నా కోలీవుడ్ కు ఎంటర్ అయ్యి పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. "తుగ్లక్ దర్బార్ ", "అరణ్మణై 3", "మేధావి ", "సైతాన్ కా బచ్చా"తమిళ మూవీస్ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఒక తమిళ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరో థ్రిల్లర్ తో వస్తున్న ‘118’ డైరెక్టర్
కరోనా టైంలో సినీ ఇండస్ట్రీ మొత్తం షట్ డౌన్ అయిందని చెప్పొచ్చు. అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి.. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి.. రామ్ గోపాల్ వర్మ ఒక్కడే వరుసపెట్టి సినిమాలు తీసినట్టు కనిపించాడు. అయితే మనకు తెలియకుండా చాలా మంది సినిమాల షూటింగ్ లు కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. దానికి కారణం కొన్ని సినిమాలు ఎప్పుడు మొదలవుతున్నాయో తెలియదు కానీ సైలెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్నాయి.
బాలీవుడ్ లో బిజీగా షాలిని పాండే
సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన షాలిని పాండే , ఆ మూవీ లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "మహానటి ", "118 "మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన షాలిని "100%కాదల్ "మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. రీసెంట్ గా రిలీజ్ అయిన "నిశ్శబ్దం" మూవీ లో ఒకముఖ్య పాత్రలో నటించారు. తెలుగు , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన షాలిని ఇప్పుడు బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు.
సితార ఉంటే చాలు.. ప్లే లిస్ట్ అవసరం లేదు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి.. అల్లరి పిడుగు సితార గురించి ప్రేత్యేకంగా చెప్పేదేముంది. చిన్నప్పటి నుండి సితార స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలిచింది. ఇక ఇప్పుడు స్వయంగా ఒక యూ ట్యూబ్ ఛానల్ నే నిర్వహిస్తుంది. వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తో కలిసి పలు వీడియోలు చేస్తూ సందడి చేస్తూనే ఉంటుంది. ఆడుతూ పాడుతూ వుండే వీడియోలే కాదు అప్పుడప్పుడు.. ఆ ఛానల్ ద్వారా వీరు సోషల్ అవెర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు.
మా కుటుంబంలోకి నీకు స్వాగతం రానా..!
తన ప్రేయసి మిహీకా బాజాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు రానా నిన్న సోషల్ మీడియా ద్వారా ప్రకటించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రానాకు సోషల్ మీడియలో శుభాకాంక్షలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా చేరిపోయారు. మిహిక, సోనం మంచి స్నేహితులని తెలిసిందే. ఇప్పుడు తాజాగా మిహిక కు సోనమ్ కపూర్ కూడా దీనిపై స్పందించి అభినందనలు తెలిపారు. ‘‘డార్లింగ్ బేబీ మిహిక... నీకు శుభాకాంక్షలు. లవ్ యూ. అత్యుత్తమైనవి పొందేందుకు నువ్వు అర్హురాలివి. రానా.. నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకుంటాడు. మా కుటుంబంలోకి నీకు స్వాగతం రానా’’ అంటూ…
బాలీవుడ్ రీమేక్ మూవీ లో రాజ్ తరుణ్
సక్సెస్ ఫుల్ "ఉయ్యాలా జంపాలా " మూవీ తో రాజ్ తరుణ్ టాలీవుడ్ కు ఎంటర్ అయ్యి "సినిమా చూపిస్త మామ" , "కుమారి 21 F" , "కిట్టు ఉన్నాడు జాగ్రత్త ", "అంధగాడు", "రాజుగాడు" వంటి కామెడీ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన "ఒరేయ్ బుజ్జిగా " మూవీ కరోనా మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది.
ప్రజా గాయకురాలు పాత్ర లో సాయి పల్లవి ?
సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ " మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ , శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై రొమాంటిక్ ఎంటర్ టైనర్ "విరాటపర్వం 1992 " మూవీ రూపొందుతుంది. పీరియాడిక్ డ్రామా గా రూపొందుతున్న ఈ మూవీ లో ప్రియమణి, నందితాదాస్, జరీనా వహాబ్ , నవీన్ చంద్ర, సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
విక్రమ్ "కోబ్రా "మూవీ అప్ డేట్
విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ "కోబ్రా " లో నటిస్తున్నారు. సూపర్ హిట్ "ఇమైక్క నోడిగళ్" మూవీ ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై "కోబ్రా "మూవీ రూపొందుతుంది. బ్లాక్ బస్టర్ KGF చాప్టర్ 1 మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయిక కాగా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, దర్శకుడు KS రవి కుమార్, ఆనంద్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. AR రెహమాన్ సంగీతం అందించారు.
KGF చాప్టర్ 2 మూవీ రిలీజ్ వాయిదా ?
దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ " KGF చాప్టర్1" కన్నడభాషలో ఘనవిజయం సాధించి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే.
రేపే యంగ్ హీరో నిఖిల్ పెళ్లి..!
లాక్ డౌన్ వల్ల యంగ్ హీరో నిఖిల్ వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. పల్లవి వర్మ అనే డాక్టర్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్ పెద్దల అంగీకారంతో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. ఏప్రిల్ 16న వీరి వివాహం జరగాలి. లాక్ డౌన్ అయినా గుడిలో పెళ్లి చేసుకుంటా అని గతంలో చెప్పాడు. అయితే ఆ తర్వాత మళ్ళీ వాయిదా వేశారు. ఇక ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడటంతో తాజాగా పెళ్లి ముహుర్తాన్ని నిర్ణయించినట్టు తెలుస్తుంది. రేపు నిఖిల్,పల్లవిల వివాహం జరగనున్నట్టు సమాచారం. మంచి ముహూర్తాలు లేకపోవడం.. మూఢం వల్ల మరో మూహూర్తం కోసం దాదాపు ఏడాది వరకు వేచి చూడాల్సి వస్తుందని హీరో నిఖిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు…
'రానా' ప్రేయసి వివరాలు - 'మిహిక బజాజ్' హైద్రాబాదీనే ..!
మొత్తానికి ఇన్నేళ్లకు రానా తన ప్రేమను బహిరంగంగా ప్రకటించాడు. నిన్న సోషల్ మీడియా వేదికగా తన లవ్ సంగతి బయట పెట్టగా మొదట అందరూ షాక్ తిన్నా ఆ తర్వాత అభినందనలు తెలిపారు. సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. అంతేకాదు పలువురు సినీ ప్రముఖులు కూడా రానా కు అభినందనలు తెలుపగా పలువురు హీరోలు మాత్రం కామెడీగా స్పందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక వీరి పెళ్లి ఈ ఏడాదిలోనే జరగనుంది. దీనిపై రానా తండ్రి సురేష్ బాబు కూడా క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ లో పెళ్లి ఉంటుందని.. అంతకంటే ముందు అయినా అవ్వచ్చని తెలిపారు.
బాలీవుడ్ పై ఆసక్తి
"ఎవరే అతగాడు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియమణి పలు తెలుగు, కన్నడ , తమిళ, మలయాళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో నటించారు. "పరుత్తి వీరన్ "తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ "చెన్నై ఎక్స్ ప్రెస్" ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ప్రియమణి ప్రస్తుతం "నారప్ప ", "విరాటపర్వం"మూవీస్ లో నటిస్తున్నారు. అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "మైదాన్" హిందీ మూవీ లో ప్రియమణి నటించారు.

జగపతిబాబు, లయ ‘మనోహరం’కి 20 ఏళ్ళు
కుటుంబకథా చిత్రాల కథానాయకుడు జగపతిబాబు కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ‘మనోహరం’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ పాట్రియాటిక్ డ్రామాలో జగపతిబాబుకి జోడిగా లయ నటించింది. ప్రకాష్‌రాజ్, బ్రహ్మాజీ, సూర్య, ముకేష్ రిషి, చంద్రమోహన్, మల్లికార్జున రావు, యం.ఎస్.నారాయణ, యల్.బి.శ్రీరాం, బెనర్జీ, ఝాన్సీ, వినోద్ బాల ముఖ్య భూమికలు పోషించారు.
సోషల్ మీడియాలో సాయితేజ్ హవా
ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియాదే హవా. అందుకే నిన్నటి తరం అగ్ర కథానాయకుల నుంచి నేటి తరం యువ కథానాయకుల వరకు అంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. తమ తమ సినిమాల అప్‌డేట్స్‌తో పాటు.. వ్యక్తిగత, సామాజిక అంశాలతో కూడా తమ అభిమానులను అలరిస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే.. రెండు వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫాలోవర్స్ పరంగా రెండు ల్యాండ్ మార్క్స్‌ను అందుకున్నాడు మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్.
ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండ సంచలనం
‘పెళ్ళిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’.. ఇలా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌తో ఈ తరం ప్రేక్షకులకు చేరువయ్యాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. సినిమాలతోనే కాదు.. సోషల్ మీడియాలోనూ తనదైన బాణీతో సంచలనం సృష్టిస్తున్నాడీ టాలెంటెడ్ హీరో. ఎంతలా అంటే.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం అధిగమించి ఇన్‌స్టాగ్రామ్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు ఈ “రౌడీ హీరో”.
'రాములాతో' మరోసారి చంపేశావ్.. థాంక్స్ వార్నర్..!
మొత్తానికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ తెలుగు సినిమా పాటలు, డైలాగులతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. 'అల వైకుంఠపురములో' పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. ఇక ఈపాటలు వార్నర్ కు కూడా బాగా నచ్చినట్టు ఉన్నాయి. మొన్నేమో బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేసి అందరికి షాకివ్వగా.. ఇప్పుడు రాములో రాములా పాటకు కూడా కాలు కదిపాడు. `రాములో..రాముల`కు తన ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ చేయగా ఈ వీడియోకు కూడా సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది.