టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాలతో యంగ్ రెబల్ స్టార్ ముందుండగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 400 కోట్ల తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రౌద్రం రణం రుధిరం “మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక &హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రూపొందనున్న #NTR30 మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “RRR” మూవీ తో ఎన్టీఆర్ ఇమేజ్ పాన్ ఇండియా స్థాయికి ఎదగడం ఖాయం అని నిర్మాతలు భారీ బడ్జెట్ తో #NTR30 మూవీ తెరకెక్కించనున్నారు. ఈ మూవీ తరువాత బ్లాక్ బస్టర్ “KGF చాప్టర్ 1” మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఒక మూవీ రూపొందనుంది. ఈ మూవీ పలు భాషలలో రిలీజ్ కానుందని సమాచారం. ఇలా ఎన్టీఆర్ హీరోగా రూపొందే అన్ని చిత్రాలు భారీ బడ్జెట్ తో రూపొందడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: