పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వల్ల రిలీజ్ కు నోచుకోలేదు. లాక్ డౌన్ తీసేసినా ఈ ఏడాది ఈ సినిమా రావడం కష్టమే అంటున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత క్రిష్ తో మరో సినిమాను చేస్తున్నాడు పవన్. పీరియాడిక్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కబోతుంది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్రిష్ తర్వాత హరీష్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కథానాయికగా మానస రాధాకృష్ణన్ ను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతవరకూ 10 మలయాళ చిత్రాలలో నటించిన మానస రాధాకృష్ణన్, తెలుగులో పవన్ కల్యాణ్ జోడీగా చేయడానికి అంగీకరించిందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయవలసి వుంది. ప్రస్తుతం ఆమె మలయాళంలో ‘పరమగురు’ సినిమా చేస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. మరి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: