కథానాయకుడిగా ‘అల్లరి’ నరేష్‌ది పద్దెనిమిదేళ్ళ నటనా ప్రస్థానం. 2002లో విడుదలైన ‘అల్లరి’ చిత్రంతో నరేష్ కెరీర్ ప్రారంభమైంది. ఆ ఏడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఆపై ఇదే సీజన్లో వచ్చిన ‘అల్లరి’ నరేష్ పలు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే.. 2020 వేసవికి ‘అల్లరి’ నరేష్ ‘డబుల్ ధమాకా’ ప్లాన్ చేసుకున్నాడు. రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్రణాళిక రచించాడు. ఆ చిత్రాలే.. ‘బంగారు బుల్లోడు’, ‘నాంది’. ఏప్రిల్‌లో ‘బంగారు బుల్లోడు’ విడుదల కావాల్సి ఉండగా.. మే నెలాఖరులో ‘నాంది’ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో ప్లానింగ్ అంతా తారుమారైంది. దాంతో ‘అల్లరి’ నరేష్ సమ్మర్ ‘డబుల్ ధమాకా’ మిస్సయింది. మరి.. వేసవి సీజన్‌ని మిస్సయిన ‘బంగారు బుల్లోడు’, ‘నాంది’ చిత్రాల నయా రిలీజ్ డేట్స్ ఏంటో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: