కామెడీ థ్రిల్లర్ మూవీ లో హీరో నాని

Natural Star Nani To Act In Comedy Thriller Movie Produced By Mythri Movie Makers

హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” కరోనా మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది. హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విభిన్న కథా చిత్రాలు ఎంపిక చేసుకునే నాని మరొక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సూపర్ హిట్ “మెంటల్ మదిలో”, “బ్రోచేవారెవరురా” మూవీస్ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. “టక్ జగదీష్ ” మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఒక మూవీ తో మరొక మూవీ కి సంబంధం లేకుండా భిన్నమైన కథా చిత్రాలలో నాని నటించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =