టీనేజ్ అమ్మాయికి తండ్రిగా బాలకృష్ణ?

Nandamuri Balakrishna To Play Father To A Teenage Girl In His Upcoming Movie With B Gopal

నటసింహ బాలకృష్ణ, నిన్నటితరం అగ్రశ్రేణి దర్శకుడు బి.గోపాల్‌ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో 5 చిత్రాలు రాగా.. వాటిలో నాలుగు సినిమాలు సంచలనం సృష్టించాయి. ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’.. ఇలా బాలయ్య, గోపాల్ కాంబినేషన్‌లో 4 బ్లాక్‌బస్టర్ మూవీస్ ఉన్నాయి. కట్ చేస్తే.. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. బాలయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుందని ప్రచారం సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి కథను అందించారని సమాచారం. అంతేకాదు.. ఇందులో టీనేజ్ అమ్మాయికి తండ్రిగా బాలయ్య కనిపిస్తారని టాక్. పవర్‌ఫుల్‌గా సాగే ఈ పాత్రలో అన్ని రకాల భావోద్వేగాలకు స్కోప్ ఉంటుందని వినికిడి. త్వరలోనే బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ మూవీపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =