వెబ్ సిరీస్ అనుమతి కోసం ప్రభుత్వానికి అల్లు అరవింద్ రిక్వెస్ట్..!

Tollywood Ace Producer Allu Aravind Seeks Government Permission For Shooting A New Web Series
Tollywood Ace Producer Allu Aravind Seeks Government Permission For Shooting A New Web Series
కరోనా వల్ల సినీ పరిశ్రమకు పెద్ద సమస్యలే వచ్చి పడ్డాయి. ఏదో చిన్న చిన్న పనులంటే ఇంట్లో ఉండి కానిచ్చేస్తున్నారు కానీ అన్ని పనులు అవ్వాలంటే కష్టం. జూన్ నుండి షూటింగ్ లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నా అది ఎంత వరకూ సాధ్యపడుతుందో తెలియదు. కేర‌ళ లాంటి రాష్ట్రాల్లో.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు అనుమ‌తులు ఇచ్చారు. అక్క‌డ షూటింగులు కూడా మొద‌ల‌య్యే ఛాన్సుంది. కానీ ఇక్కడ మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. విదేశాల్లో షూటింగ్ అనే ఆలోచ‌నే లేదు. దానికోసం స్క్రిప్ట్ లో మార్పులు చేసుకుంటున్నారట దర్శక నిర్మాతలు.
ఇక ఇదిలా ఉండగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ను అల్లు అరవింద్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆహా నుండి పెద్ద రేంజ్ లోనే అల్లు అరవింద్ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఈ డిసెంబ‌రు లోపు ఏకంగా 20 వెబ్ సిరీస్‌లు నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారట. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు ఉన్న డిమాండ్ చూసిన తర్వాత అల్లు అర‌వింద్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ ఎత్తేశాక, విధించే నియ‌మ నిబంధ‌న‌ల్ని దృష్టిలో ఉంచుకుని షూటింగ్‌లు చ‌క చ‌క పూర్తి చేసుకోవాల‌ని భావిస్తున్నట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ అగ్రనిర్మాత అల్లు అరవింద్ ప్రభుత్వానికి ప్రత్యేక విన్నపం చేసినట్టు సమాచారం. ఓ మినీ వెబ్ సిరీస్ ను నిర్మించాలనుకుంటున్న నేపథ్యంలో… దీని కోసం 15 నుంచి 20 మంది సభ్యులున్న యూనిట్ కు అనుమతి ఇవ్వాలని కోరారట. కరోనా ఎఫెక్ట్ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెప్పినట్టు సమాచారం. మరి ప్రభుత్వం అనుమతి ఇస్తుందో లేదో చూద్దాం.
[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =