కన్నీళ్లు పెట్టించే విధంగా ‘సాయి పల్లవి’ పాత్ర..!

Sai Pallavi Action In That Scene Going To Be The Biggest Highlight For Virata Parvam
Sai Pallavi Action In That Scene Going To Be The Biggest Highlight For Virata Parvam

ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన తమిళ బ్యూటీ సాయిపల్లవి. ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ తో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. తన అందం దానికి తగిన అభినయంతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అయితే సాయి పల్లవి గురించి తెలుసు కదా.. కేవలం పాత్ర ప్రాధాన్యమైన పాత్రలు మాత్రమే ఎంచుకుంటదని. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తుంది. దానితో పాటు ‘విరాట పర్వం’ సినిమా చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. రెండు రోజుల క్రితమే సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. సాయిపల్లవి ఎందుకు నక్సలైట్ గా మారాల్సి వచ్చింది? నక్సలైట్ గా మారిన ఆమె చివరికి సాధించినది ఏమిటి? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుందని అంటున్నారు. అంతేకాదు ఈ క్రమంలో ఆమె తన ప్రాణాలను కూడా కోల్పోతుందని చెబుతున్నారు. ఆ సన్నివేశంలో ఆమె ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తుందని అంటున్నారు. సినిమా అంతటికి ఆ సన్నివేశం హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. మరి సాయి పల్లవి నటన గురించి అందరికీ తెలుసు. నిజంగానే కన్నీళ్లు పెట్టిస్తుందేమో చూద్దాం..

కాగా ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ రావ్‌,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.